Homeఎంటర్టైన్మెంట్Drishyam 3 teaser review: 'దృశ్యం 3' టీజర్ వచ్చేసింది.. ఇవేమి ట్విస్టులు సామీ.. మోహన్...

Drishyam 3 teaser review: ‘దృశ్యం 3’ టీజర్ వచ్చేసింది.. ఇవేమి ట్విస్టులు సామీ.. మోహన్ లాల్ నట విశ్వరూపం..

Drishyam 3 teaser review: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో క్రైమ్ మిస్టరీ జానర్ సినిమాల్లో ఒక సంచలనం ‘దృశ్యం’. మలయాళం లో మోహన్ లాల్ హీరో గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పింది. ఇదే సినిమాని తెలుగు లో విక్టరీ వెంకటేష్ , తమిళంలో కమల్ హాసన్ , హిందీ లో అజయ్ దేవగన్ వంటి వారు చేశారు. అన్నిట్లోనూ సూపర్ హిట్టే. ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన […]

Drishyam 3 teaser review: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో క్రైమ్ మిస్టరీ జానర్ సినిమాల్లో ఒక సంచలనం ‘దృశ్యం’. మలయాళం లో మోహన్ లాల్ హీరో గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పింది. ఇదే సినిమాని తెలుగు లో విక్టరీ వెంకటేష్ , తమిళంలో కమల్ హాసన్ , హిందీ లో అజయ్ దేవగన్ వంటి వారు చేశారు. అన్నిట్లోనూ సూపర్ హిట్టే. ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ‘దృశ్యం 2’ కోవిడ్ లాక్ డౌన్ కారణంగా అటు మలయాళం లోనూ, ఇటు తెలుగు లోనూ ఓటీటీ లో నేరుగా విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అయిన ‘దృశ్యం 2’ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ హిందీ లో మాత్రం అజయ్ దేవగన్ కొన్నాళ్ళు గడిచాక థియేటర్స్ లో విడుదల చేశారు.

థియేటర్స్ లో ఆ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘దృశ్యం 3’ చిత్రం మలయాళం లో, హిందీ లో తెరకెక్కుతుంది. తెలుగు లో ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంది. అయితే మలయాళం వెర్షన్ వచ్చే నెల 21 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని నేడు కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొదటి రెండు భాగాల్లో జరిగిన కథని ఒక గ్లింప్స్ గా ఈ టీజర్ లో చూపించారు. ఇక మూడవ భాగానికి సంబంధించిన స్టోరీ ని డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఎక్కువగా రివీల్ చెయ్యలేదు, కానీ ఈ టీజర్ లో హీరో పోలీసులకు దొరికిపోతాడు అనే చిన్న క్లూ ఇచ్చాడు. తెలిసో తెలియకో , నేను జీవితం లో నటించడం మొదలు పెట్టాను , అది కేవలం నా కుటుంబం కోసమే, ఈ నట జీవితంలో ఎంతో మంది అమాయకులను మోసం చేశాను , బాధపెట్టాను , ఇక శిక్ష అనుభవించే సమయం దగ్గరకి వచ్చేసిందేమో అంటూ హీరో మోహన్ లాల్ ఒక చర్చిలో కూర్చొని దేవుడికి చెప్పుకుంటూ ఉంటాడు.

అంటే దీని అర్థం , ఈ సినిమాలో ఆయన పోలీసులకు శాశ్వతంగా లొంగిపోతాడు అని. ‘దృశ్యం’ సిరీస్ లో ఇదే చివరి సినిమా, డైరెక్టర్ ఈ సిరీస్ ని ఎలా ముగిస్తాడు అనే దానిపై ప్రేక్షకుల్లో విప్పతీతమైన ఆసక్తి ఉంది. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు లో తెరకెక్కిస్తారో లేదో చూడాలి. ప్రస్తుతానికి విక్టరీ వెంకటేష్ డేట్స్ ఖాళీ లేవు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రం చేస్తున్న ఆయన , అనిల్ రావిపూడి తో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యేలోపు , మలయాళం వర్షన్ ‘దృశ్యం 3’ థియేటర్స్ నుండి ఓటీటీ లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. మరి రీమేక్ చేస్తే జనాలు థియేటర్స్ కి వచ్చి చూస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper