Drishyam 3 Movie Plus And Minus: జీతూ జోసఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ‘దృశ్యం’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాని తెలుగులో వెంకటేష్ హీరోగా దృశ్యం పేరుతో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమాకి రెండు పార్టులు రావడం ఆ రెండు కూడా సూపర్ సక్సెస్ ని సాధించడంతో ప్రేక్షకులు దృశ్యం సినిమా అంటే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మాస్టర్ పీస్ అనే ఒక మార్క్ అయితే పడిపోయింది. ఇక అలాంటి క్రమంలోనే దృశ్యం 3 సినిమా రాబోతుంది అంటూ గత కొన్ని నెలల నుంచి అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా రీసెంట్ గా థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
ప్లస్ పాయింట్స్
ఈ సినిమాలో మోహన్ లాల్ నటన చాలా అద్భుతంగా ఉంది. తనని కంప్లీట్ యాక్టర్ అని ఏ క్షణాన అన్నారో తెలియదు కానీ ఈ మూవీలో ఆయన నట చూస్తే ఆయన్ని అందరూ క్లిట్ యాక్టర్ అని పిలుస్తారు… ఒక ఫ్యామిలీ పడే ఇబ్బందిని అలాగే ఆ ఫ్యామిలీలో ఉన్న పెద్ద ఎలా సఫర్ అవుతాడు అనేది మన కండ్లకు కట్టినట్టుగా నటించి మెప్పించాడు…
సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. దాంతో ఒక హై ఫీల్ కలుగుతుంది…
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ మొత్తం చాలా స్లో నేరేషన్ తో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాల్లో ఉండకూడనిదే స్లో నేరేషన్ అలాంటిది ఈ సినిమాలో అది ఉండడంవల్ల మూవీ చూసే ప్రతి ప్రేక్షకుడికి మనం ఎందుకు ఈ సినిమాకు వచ్చామురా బాబోయ్ అనే ఫీల్ కలుగుతుంది. ఇక ఇంటర్వెల్ కి వచ్చేసరికి సినిమా మీద ప్రేక్షకుడికి హోప్ పోతుంది…
ఇక దర్శకుడు జీతూ జోసఫ్ స్క్రీన్ ప్లే ని సరైన రీతిలో రాసుకోలేకపోయాడు. ఈ సినిమా ఆధ్యాంతం ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయలేకపోయింది.ఇక దానికి తోడు ఆయన ఇంతకు ముందు చేసిన దృశ్యం, దృశ్యం 2 రెండు పార్ట్ లలో హీరో ఎలా సేవ అవుతాడా అనే పాయింట్ హైలెట్ అయ్యేది. ఇక ఈ మూవీలో మాత్రం హీరో ఎలాగైనా సేవ అవుతడులే అనే నమ్మకం ప్రేక్షకుడిలో కలిగింది. దాని వల్ల సినిమాలో క్యూరియాసిట్ మిస్ అయింది.
ఇక ఈ సినిమాలో ఎంతసేపు హీరో కూతురికి పెళ్లి చేయాలనే పాయింట్ మీదనే తిరుగుతూ ఉంటుంది. కానీ సరైన కాన్ఫ్లిక్ట్ అయితే ఎక్కడ పడలేదు. దృశ్యం రెండు పార్టులు తీసుకుంటే ఆ కుటుంబం పడే సఫర్ ను ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆన్ చేసుకొని చూశాడు. కానీ ఈ పార్ట్ లో అది మిస్ అయింది…
