Homeఎంటర్టైన్మెంట్Dragon in OG 2: 'ఓజీ 2' లో 'డ్రాగన్'.. సుజిత్ విజన్ కి ఈసారి...

Dragon in OG 2: ‘ఓజీ 2’ లో ‘డ్రాగన్’.. సుజిత్ విజన్ కి ఈసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్..

Dragon in OG 2: మన టాలీవుడ్ నుండి లోకేష్ కనకరాజ్ తరహా డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే డైరెక్టర్ సుజిత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ప్రమోషనల్ కంటెంట్ తోనే సినిమా పై విపరీతమైన హైప్ ని పెంచగల సత్తా ఉన్న డైరెక్టర్ ఆయన. కానీ హాఫ్ బేకింగ్ మూవీస్ తో తదుపరి లెవెల్ కి వెళ్లలేకపోయాడు ఇన్ని రోజులు. గత ఏడాది పవన్ కళ్యాణ్ తో తీసిన ‘ఓజీ’ చిత్రం జెన్ జీ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. కానీ సెకండ్ హాఫ్ ఇంకా బాగా తీసి ఉండాల్సిందని , చాలా రొటీన్ స్టోరీ అవ్వడం వల్ల, ఆ చిత్రానికి పాన్ ఇండియా లెవెల్ లో రీచ్ రాలేదని అభిమానుల్లో ఏర్పడిన చిన్న అసంతృప్తి. కానీ ముందుగా రాసుకున్న సెకండ్ హాఫ్ అది కాదట.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ గా ఉండడం వల్ల, ఓజీ చిత్రం షూటింగ్ కి కాస్త బ్రేక్ పడింది. మళ్లీ తిరిగి షూటింగ్ లోకి వచ్చిన తర్వాత , సమయం లేకపోవడం తో , ముందు అనుకున్న సెకండ్ హాఫ్ స్టోరీ ని పక్కన పెట్టి, సింపుల్ గా సెకండ్ హాఫ్ ని డిజైన్ చేయాల్సి వచ్చిందట. అయితే నేడు ‘ఓజీ 2’ కి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో వచ్చింది. ఈ వీడియో చివర్లో పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం తన నుండి నూటికి నూరు శాతం బెస్ట్ ఇస్తానని మాట ఇవ్వడం తో సుజిత్ కి క్రియేటివ్ ఫ్రీడమ్ దొరికినట్టు అయ్యింది. ఈ వీడియో సుజిత్ పవన్ కళ్యాణ్ కి కథ ని వివరిస్తే ‘అతనికి ఒక పెట్(పెంపుడు జంతువు) ఉంటుంది అన్నమాట’ అని అంటాడు గుర్తుందా?, పెట్ అంటే కుక్కనో , పిల్లినో అనుకునేరు, ఏకంగా డ్రాగన్ అది.

డ్రాగన్ ని హీరో కి పెట్ అనడం సుజిత్ మార్క్ పీక్ ఎలివేషన్ అనొచ్చు. సినిమాలో డ్రాగన్ పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతుంది. డ్రాగన్ విజువల్స్ తో ఇప్పటి వరకు ఇండియా లో ఒక్క సినిమా కూడా రాలేదు. బడ్జెట్ సుజిత్ అడిగినంత ఇవ్వగలిగితే మాత్రం దేశం గర్వించదగ్గ చిత్రం ఆయన నుండి రాబోతుంది అనుకోవచ్చు. ఓజీ చిత్రానికి ఫుల్ రన్ లో 320 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, అది ‘ఓజీ 2’ కి మొదటి రోజే రావొచ్చు , ఆ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎన్ని అద్భుతాలను నెలకొల్పబోతుందో చూడాలి. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రాన్ని భారీ లెవెల్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇది కేవలం పాన్ ఇండియన్ సినిమా మాత్రమే కాదు , పాన్ వరల్డ్ సినిమా అట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular