https://oktelugu.com/

‘అల్లుడు’ రాక మీద అనుమానాలు !

ఈ సంక్రాంతికి అదరగొట్టడానికి ‘అల్లుడు’ వస్తున్నాడంటూ బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ సినిమా టీమ్ బాగానే హడావుడి చేశారు. జనవరి 15న ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. జనం థియేటర్స్ కి వస్తారనే నమ్మకం పెరగడంతో మేకర్స్ కూడా బాగానే హడావుడి చేశారు. చివరకు అల్లుడు అదుర్స్ సినిమా ఇంకా రెడీ కాలేదు. ఓ పాట బాకీ ఉంది. ఆ పాట ఇప్పుడు హైద‌రాబాద్ లో తెర‌కెక్కిస్తున్నారు. కాగా ఆ పాట […]

Written By:
  • admin
  • , Updated On : January 9, 2021 / 11:04 AM IST
    Follow us on


    ఈ సంక్రాంతికి అదరగొట్టడానికి ‘అల్లుడు’ వస్తున్నాడంటూ బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ సినిమా టీమ్ బాగానే హడావుడి చేశారు. జనవరి 15న ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. జనం థియేటర్స్ కి వస్తారనే నమ్మకం పెరగడంతో మేకర్స్ కూడా బాగానే హడావుడి చేశారు. చివరకు అల్లుడు అదుర్స్ సినిమా ఇంకా రెడీ కాలేదు. ఓ పాట బాకీ ఉంది. ఆ పాట ఇప్పుడు హైద‌రాబాద్ లో తెర‌కెక్కిస్తున్నారు. కాగా ఆ పాట రేప‌టితో పూర్త‌వుతుందట. ఆ త‌ర‌వాత‌.. ఎడిటింగ్, ఫైన‌ల్ మిక్సింగ్, డీఐ ఇవ‌న్నీ జ‌ర‌గాలి కాబట్టి.. 15కి సినిమా రెడీ అవుతోందా అనేది డౌటే.

    Also Read:  ‘ఆర్ఆర్ఆర్ – కేజీఎఫ్-2’ రిలీజ్ డేట్స్ లో ఒప్పందం !

    మొత్తానికి ఈ నేపధ్యంలో సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందో లేదోనన్న ఉత్కంఠనెలకొంది అందరిలో. అసలు సినిమా ఆలస్యం కావడానికి మెయిన్ రీజన్.. ఈ పాట నాలుగు రోజుల క్రిత‌మే పూర్తి కావ‌ల్సివుందట. ఓ పాట కోసం టీమ్ కశ్మీర్ వెళ్లడం, అక్క‌డ కొన్ని కారణాల వల్ల అనుకోకుండా స్ట్ర‌క్ అయిపోవ‌డంతో మొత్తానికి సాంగ్ షూట్ పోస్ట్ ఫోన్ అయింది. ఇప్పుడు ఆఘ‌మేఘాల‌మీద ఈ పాట‌ను షూట్ చేస్తున్నారు. ఇక ‘రాక్షసుడు’ సినిమాతో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ రెట్టించిన ఉత్సాహంతో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తోన్నాడు. కానీ, పాపం సినిమానే ముందు పూర్తి చేయలేకపోయాడు.

    Also Read: చరణ్ తో మహేష్ డైరెక్టర్ ఫిక్స్.. కాకపోతే ?

    కాగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ గా రానున్న ఈ సినిమా కూడా గతంలో సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘కందిరీగ’ ఫార్మాట్లో ఉంటుందట. ‘కందిరీగ’లో మంచి ఫన్ ఉన్నట్టే.. ఈ అల్లుడు అదుర్స్ లో కూడా డీసెంట్ ఫన్ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో సోనూ సూద్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడు, ఈ సినిమాలో ఫైట్స్ సంగతి సరేసరి. అన్నీ హైఓల్టేజ్ పోరాటాలే అట. రామ్, లక్ష్మణ్ కంపోజ్ చేస్తున్న ఈ ఫైట్స్ కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు పెట్టారు. మరి.. సంక్రాంతి పోటీలో ఈ సినిమా నిలుస్తోందా.. చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్