జగన్ వచ్చాక హిందూ ఆలయాలపై దాడులు ఎందుకు?

అసలు ఒక్క ఏపీలోనే ఇలా ఎందుకు జరుగుతోంది..? చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎందుకిలా చేస్తున్నారు..? దీని వెనుక ఎవరున్నారు..? ఇది కాకతాళీయంగా జరుగుతున్న దాడులా..? కావాలని చేస్తున్నవా..? ఏది ఏమైనా ఏపీలో విగ్రహాల ధ్వంసాలు.. ఆలయాలపై దాడులు ఆందోళన కలిగించే అంశాలే. ముఖ్యంగా జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొదటి దాడి నుంచే పోలీసులు ఎంక్వైరీ సైతం చేస్తున్నారు. కానీ.. ఇంతవరకు ఒక్క దొంగను కూడా […]

Written By: Srinivas, Updated On : January 9, 2021 10:52 am
Follow us on


అసలు ఒక్క ఏపీలోనే ఇలా ఎందుకు జరుగుతోంది..? చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎందుకిలా చేస్తున్నారు..? దీని వెనుక ఎవరున్నారు..? ఇది కాకతాళీయంగా జరుగుతున్న దాడులా..? కావాలని చేస్తున్నవా..? ఏది ఏమైనా ఏపీలో విగ్రహాల ధ్వంసాలు.. ఆలయాలపై దాడులు ఆందోళన కలిగించే అంశాలే. ముఖ్యంగా జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొదటి దాడి నుంచే పోలీసులు ఎంక్వైరీ సైతం చేస్తున్నారు. కానీ.. ఇంతవరకు ఒక్క దొంగను కూడా పట్టుకోలేదు. దీనిపై ఇంకా ప్రభుత్వం కూడా సమాధానం చెప్పలేకపోతోంది.

Also Read: అఖిలప్రియ భవిష్యత్ ఏం కానుంది?

అయితే.. ఇది రాజకీయ దాడులా..? ఎవరైనా కావాలని చేస్తున్నారా..? అనేది తెలియకుండా ఉంది. ఇంకా పోలీసు విచారణ సైతం కొలిక్కి రావడం లేదు. మొత్తంగా వరుస దాడులు మాత్రం జగన్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. నిజానికి ఎవరు అధికారంలో ఉన్నా మతపరమైన విశ్వాసాలతో ఆడుకోరు. రాజకీయంగా తనకు నష్టం కలిగిస్తుందని తెలుసు. జగన్ హిందూ ద్వేషి కాదు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న ఉద్దేశంతోనే హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని సులువుగానే అర్థమవుతోంది.

అయితే.. రాష్ట్రంలో ఆలయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇలా నిత్యం దాడులు చేస్తున్న వారిని పట్టుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉంది. అంతర్వేది రథం దగ్ధం రాష్ట్రమంతటా కలకలం రేపింది. దీనిపై జగన్ స్వయంగా సీఐబీ విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత దుర్గగుడిలో వెండి సింహాలు మాయమయ్యాయి. అయితే.. లాక్‌డౌన్ సమయంలో కొందరు డబ్బుల కోసం ఇవి చేసి ఉంటారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Also Read: టీడీపీ నోరు మూయించే జగన్ ప్లాన్

తాజాగా విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం కేసు మరోమారు చర్చనీయాంశమైంది. దీనిపై జగన్ సీరియస్ అయి నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. ఇదిలా ఉండగానే తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రిలో సుబ్రహ్మణ‌్యేశ్వరి స్వామి ఆలయంలో కూడా విగ్రహాల ధ్వంసం జరిగింది. ఇలా వరుస టనలు కలకలం రేపుతూనే ఉన్నాయి. ఏదిఏమైనా హిందూ దేవాలయాలపై దాడులను నియంత్రించకపోతే జగన్ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోక తప్పదు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్