OTT : ఓటీటీ లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటున్న ‘డబుల్ ఇస్మార్ట్’.. మొదటిరోజు ఎన్ని వ్యూస్ వచ్చాయంటే!

ఓటీటీ లో తెలుగు మరియు హిందీ వెర్షన్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సుమారుగా 50 రోజుల వరకు ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూ ఉండేది. ఇప్పుడు అదే తరహా రెస్పాన్స్ రామ్ పోతినేని - పూరి జగన్నాథ్ లేటెస్ట్ చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' కి కూడా జరగబోతుందా అంటే అవుననే అనాలి.

Written By: Vicky, Updated On : September 5, 2024 7:06 pm

OTT Movies

Follow us on

 

OTT : చాలా సినిమాలు థియేటర్స్ లో అద్భుతమైన రన్ ని సొంతం చేసుకొని, ఓటీటీ లో మాత్రం డిజాస్టర్ రివ్యూస్ ని దక్కించుకుంటూ ఉంటాయి. ఉదాహరణకి ‘సలార్’ చిత్రం తెలుగు వెర్షన్ కి అనుకున్న స్థాయిలో నెట్ ఫ్లిక్స్ వ్యూస్ రాలేదు. అదే విధంగా థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ‘గుంటూరు కారం’ కలెక్షన్స్ పరంగా పెద్ద డిజాస్టర్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ లో తెలుగు మరియు హిందీ వెర్షన్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సుమారుగా 50 రోజుల వరకు ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూ ఉండేది. ఇప్పుడు అదే తరహా రెస్పాన్స్ రామ్ పోతినేని – పూరి జగన్నాథ్ లేటెస్ట్ చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ కి కూడా జరగబోతుందా అంటే అవుననే అనాలి.

థియేటర్స్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ హిస్టరీ లోనే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. 40 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే కనీసం 10 కోట్ల షేర్ ని కూడా రాబట్టలేదు. అలాంటి చిత్రం రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా ని అమెజాన్ లో చూసిన ప్రతీ ఒక్కరు సినిమా బాగానే ఉందే, ఎందుకు ఆ స్థాయిలో ఫ్లాప్ అయ్యింది అంటున్నారు. ఈ సినిమాకి పెద్ద మైనస్ ఏదైనా ఉందా అంటే అది కమెడియన్ అలీ క్యారక్టర్. ఎదో చిన్న కామియో లాగ పెట్టుంటే ఈ స్థాయి నెగటివ్ రెస్పాన్స్ వచ్చేది కాదు, కానీ సినిమా మొత్తం అలీ కనిపిస్తూ ఆడియన్స్ కి చిరాకు కలిగించాడు. ఆయన వల్లే ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది, లేకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టి ఉండేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే ఇటీవలే ఓటీటీ లో విడుదలైన ఈ సినిమా నెంబర్ 1 స్థానం లో ట్రెండ్ అవుతుంది. అంతే కాదు కేవలం 24 గంటల్లోనే ఈ సినిమాకి 50 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయట.

ఒక సూపర్ హిట్ సినిమాకి ఎలాంటి వ్యూస్ వస్తాయో, అలాంటి వ్యూస్ ఈ సినిమాకి వస్తున్నాయి. ఓటీటీ లో కళ్ళు తిరిగే రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ ఏ రేంజ్ వ్యూస్ ని దక్కించుకుంటుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమా తర్వాత రామ్ పోతినేని హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ మధ్యనే హరీష్ రామ్ ని కలిసి స్టోరీ వినిపించగా, ఆయనకు తెగ నచ్చేసినట్టు టాక్ వినిపిస్తుంది. హరీష్ శంకర్ కూడా ఈమధ్యనే మిస్టర్ బచ్చన్ తో భారీ ఫ్లాప్ అందుకున్నాడు. అలాంటి రెండు ఫ్లాప్స్ ని ఎదురుకున్న ఈ ఇద్దరు కలిసి భారీ కం బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి.