https://oktelugu.com/

Double smart : ఫ్లాప్ చిత్రాలలో అరుదైన రికార్డుని నెలకొల్పిన ‘డబుల్ ఇస్మార్ట్’..భవిష్యత్తులో ఈ రికార్డుని ఎవరు కొట్టలేరేమో!

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం 'డబుల్ ఇస్మార్ట్' చిత్రం కలెక్షన్స్ క్లోసింగ్ కి వచ్చేసిందని, ఇప్పటి వరకు ఈ సినిమా కేవలం 22 శాతం మాత్రమే రికవరీ చేసిందని, బయ్యర్స్ కి 78 శాతం నష్టాలను మిగిల్చిందని అంటున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : August 20, 2024 / 06:09 PM IST

    Double smart

    Follow us on

    Double smart : తెలుగు కమర్షియల్ సినిమా పంథా ని మార్చిన హీరో మెగాస్టార్ చిరంజీవి అయితే, ఒకే మూసలో వెళ్తున్న హీరోయిజం ని సరికొత్త పంథాలో నడిపించిన దర్శకుడు మాత్రం పూరీ జగన్నాథ్. అందులో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ ‘బద్రి’ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన పూరీ జగన్నాథ్, ఆ సినిమా సక్సెస్ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అప్పటి వరకు ఒకే మూసలో వెళ్తున్న హీరోయిజం ని చూసి విసుగెత్తిపోయిన ఆడియన్స్ కి, బద్రి హీరోయిజం సరికొత్తగా అనిపించింది. అలా మొదలైన పూరిజగన్నాథ్ కెరీర్ ఎన్నో సంచలనాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ‘పోకిరి’ సినిమాతో కేవలం ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని మాత్రమే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

    ఎందుకంటే ఆ సినిమా అన్నీ భాషల్లోనూ హిట్ గా నిల్చింది, ఈ సినిమాని రీమేక్ చేసిన హీరోలు స్టార్లు గా మారారు. పోకిరి చిత్రం నుండి పూరీ జగన్నాథ్ సినిమా అంటే ఒక బ్రాండ్ గా మారిపోయింది. హీరో ఎవరైనా పర్వాలేదు, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అయితే చాలు, ఆడియన్స్ థియేటర్స్ కి క్యూలు కట్టేవారు. కానీ ఇప్పుడు ఆ పూరీ జగన్నాథ్ మాయం అయిపోయాడు, బూతద్దం వేసి వెతికినా ఆయన కనిపించడం లేదు. పూరీ జగన్నాథ్ సినిమా అంటేనే ఆడియన్స్ పారిపోయే పరిస్థితి వచ్చింది. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఏ స్థాయి డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు పూరీ జగన్నాథ్ సినిమాలు ఇండస్ట్రీ లో కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తే, ఈ సినిమాతో ఆయన పరమ చెత్త రికార్డ్స్ లో ఒక సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించాడు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం కలెక్షన్స్ క్లోసింగ్ కి వచ్చేసిందని, ఇప్పటి వరకు ఈ సినిమా కేవలం 22 శాతం మాత్రమే రికవరీ చేసిందని, బయ్యర్స్ కి 78 శాతం నష్టాలను మిగిల్చిందని అంటున్నారు.

    డబుల్ ఇస్మార్ట్ తర్వాత ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రం కేవలం 28 శాతం రికవరీ తో రెండవ స్థానం లో నిలబడగా, 31 శాతం రికవరీ తో లీగర్ చిత్రం మూడవ స్థానంలో, 33 శాతం రికవరీ తో భోళా శంకర్ నాల్గవ స్థానంలో , 35 శాతం రికవరీ తో ఆచార్య ఐదవ స్థానంలో, 40 శాతం రికవరీ తో రాధే శ్యామ్ చిత్రాలు నిలిచాయి. ఈ లిస్ట్ లో పూరీ జగన్నాథ్ గత రెండు చిత్రాలు కూడా ఉండడం మరో రికార్డు. తనకి ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ ఇచ్చాడు అనే కృతజ్ఞతతో, పూరీ జగన్నాథ్ కి అవకాశం ఇచ్చిన హీరో రామ్ తన కెరీర్ లో ఈ సినిమా ద్వారా అతి పెద్ద డిజాస్టర్ ని చూడాల్సి వచ్చింది.