https://oktelugu.com/

Bhoni Kapoor : రాజమౌళి శ్రీదేవి మధ్య వివాదాన్ని క్రియేట్ చేసిన ఆ వ్యక్తి ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నట్లు చాలా మంది ఉన్నారు అయినప్పటికీ అందులో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంటుంది.

Written By:
  • Gopi
  • , Updated On : August 20, 2024 / 06:19 PM IST

    Bhoni Kapoor

    Follow us on

    Bhoni Kapoor : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి తెలుగు సినిమా ఇండస్ట్రీని పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే రాజమౌళి బాహుబలి సినిమాలో శివగామి పాత్ర కోసం శ్రీదేవిని తీసుకోవాలని అనుకున్నాడు. కానీ అనుకోని కారణాలవల్ల శ్రీదేవి ఆ పాత్రని రిజెక్ట్ చేయడంతో ఆమె ప్లేస్ లో రమ్యకృష్ణ ను తీసుకున్నారు. నిజానికి శ్రీదేవి ఆ పాత్ర ను వదిలి వేయడానికి కారణం ఏంటి అంటే శ్రీదేవి చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగిందట, అలాగే ఆమె మరికొన్ని కోరికలు కూడా కోరడం ఆమెకి సంబంధం లేని కొన్ని విషయాలను కూడా ఆమె తనకు కావాలి అన్నట్టుగా మాట్లాడింది.

    దాంతో రాజమౌళి ఆమెను పక్కన పెట్టినట్టుగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక రాజమౌళి ఇంటర్వ్యూ ని చూసిన శ్రీదేవి రాజమౌళి మాటల మీద క్లారిటీ ఇచ్చింది. ఆయన నా గురించి ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలియదు. నేను మాత్రం ఎక్కువ రెమ్యూనరేషన్ అడగలేదు. అసలు ఆ టాపిక్ కూడా నేను తీయలేదని క్లారిటీ ఇచ్చింది. అయితే రాజమౌళి శ్రీదేవి మధ్య డిస్టెన్స్ పెరిగి ఆమెను ఆ క్యారెక్టర్ కి తీసుకోకపోవడానికి కారణం ఏంటి అంటే మీకు తెలియకుండా తన భర్త అయిన భోని కపూర్ శ్రీదేవికి ఇంత రెమ్యూనరేషన్ కావాలి.

    అలాగే తన రీక్వైర్ మెంట్స్ మొత్తాన్ని సమకూరుస్తునే తను ఈ సినిమా చేస్తుందని కొన్ని కండిషన్లు పెట్టాడట. దానివల్లే శ్రీదేవిని రాజమౌళి రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. నిజానికి ఆయన చెప్పిన కండిషన్స్ అన్ని శ్రీదేవికి తెలియదని మీడియా సంస్థలు బయటికి కొన్ని కథనాలను వెలువరిచ్చాయి. ఇక మొత్తానికైతే శ్రీదేవి తన కెరియర్ లో ఒక మంచి సినిమాను మిస్ చేసుకుందానే చెప్పాలి. 2018 వ సంవత్సరంలో ఆమె హార్ట్ ఎటాక్ వచ్చి మరణించిన విషయం మనకు తెలిసిందే…

    ఇక మొత్తానికైతే రాజమౌళి శ్రీదేవి మధ్య గ్యాప్ పెరగడానికి మధ్యలో ఇంకొక మనిషి కారణమయ్యాడని తెలుసుకున్న శ్రీదేవి అభిమానులు చాలా వరకు బాధపడ్డారు. శ్రీదేవిని తీసుకొని ఉంటే నెక్స్ట్ లెవెల్ ఔట్ పుట్ వచ్చేది. అలాగే బిజినెస్ కూడా ఎక్కువగా జరిగేదని రాజమౌళి ఆలోచించాడు. అయినప్పటికీ మధ్యలో బోనికపూర్ లాంటి వాళ్లు కొన్ని కథనాలను చెప్పి ఆ క్యారెక్టర్ లో శ్రీదేవిని చేయకుండా చేశారు…