Pulsar Bike Jhansi: సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎప్పుడు సెలెబ్రిటీ అవుతారో చెప్పలేం. సొంత ఊరి జనాలకు కూడా తెలియని వాళ్ళను వరల్డ్ వైడ్ పాప్యులర్ చేయగల సత్తా సోషల్ మీడియాకు ఉంది. అలా తెరపైకి వచ్చిన అత్యంత సాధారణమైన వ్యక్తుల్లో పల్సర్ బైక్ ఝాన్సీ ఒకరు. వైజాక్ కి చెందిన ఝాన్సీకి డాన్స్ అంటే మహా ఇష్టం. తన టాలెంట్ నలుగురిలో ప్రదర్శించాలని, ప్రశంసలు పొందాలనేది ఆమె కోరిక. మన సమాజంలో ఇలాంటి కోరికలను ఎవరూ ప్రోత్సహించరు. పైగా లేని పోనీ అపవాదులు వేసి నిరుత్సాహపరుస్తారు. ఝాన్సీ ఇలాంటి అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. అయినవాళ్లే ఆమెను అవమానించారు.

అయితే పట్టుదలతో ఝాన్సీ డాన్సర్ గా మారారు. రమేష్ అనే వ్యక్తి ప్రోస్తాహంతో ప్రోగ్రామ్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఝాన్సీ డాన్స్ వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా మిలియన్స్ లో వ్యూస్ దక్కాయి. దీంతో ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్స్ కంట్లో పడ్డారు. తమ షోకి పిలిచి… పల్సర్ బైక్ సాంగ్ కి డాన్స్ చేయించారు. శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై ఝాన్సీ చేసిన పల్సర్ బైక్ సాంగ్ సూపర్ హిట్. ఆమె ఎనర్జిటిక్ స్టెప్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఒక్కసారిగా ఆమె పాపులర్ అయ్యారు.
ఇక షోలో ఝాన్సీ తనని గాజువాక డిపో కండక్టర్ గా పరిచయం చేసుకున్నారు. ఆ విషయం జనాలను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ పెర్ఫార్మన్స్ తర్వాత ఆమె వీడియోలు యూట్యూబ్ లో మరింత ఆదరణ దక్కించుకుంటున్నాయి. చాలా మంది పాజిటివ్ కామెంట్స్ తో ఎంకరేజ్ చేస్తుంటే… కొందరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారట. నెగిటివ్ కామెంట్స్ పై ఝాన్సీ స్పందించారు. దయచేసి అలాంటి కామెంట్స్ తో నిరుస్తాహపరచవద్దని వేడుకున్నారు.

ఇప్పుడిప్పుడే మేము గుర్తింపు తెచ్చుకుంటున్నాము. వీలైతే ప్రోత్సహించండి, అంతే కానీ నెగిటివ్ కామెంట్స్ చేయవద్దని ఓ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అలాగే కొందరు మా భర్తను తిడుతూ సందేశాలు పెడుతున్నారు. దయచేసి అలా చేయకండి. శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై డాన్స్ చేసినప్పుడు కూడా మేము టాప్ టూ బాటమ్ శరీరం కనిపించకుండా బట్టలు ధరించి పెర్ఫార్మన్స్ ఇచ్చాము. నెగిటివ్ కామెంట్స్ తో మమ్మల్ని బాధ పెట్టొద్దని ఝాన్సీ ఆవేదన చెందారు.