Georgia: కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ కావాలని చెబుతుంటారు. పెళ్లి అనే తంతు జీవితంలో ఒకసారి జరుగుతుంది. అందుకే దాని కోసం చాలా మంది కలలు కంటుంటారు. తమకు కాబోయే జీవిత భాగస్వామి గురించి కొత్త ఆలోచనలు చేస్తుంటారు. తమకు ఎలాంటి వాడు కావాలో అనేదానిపై కొన్ని అభిప్రాయాలు కలిగి ఉండటం సహజమే. పెళ్లిపై ఇక్కడ ఓ యువతి తీసుకున్న నిర్ణయం అందరిలో ఆసక్తి కలిగించింది.

అర్థం చేసుకునే అర్థాంగి ఉంటే జీవితం నందనవనమే. కానీ అపార్థం చేసుకునే భార్య ఉంటే జీవితమంతా నరకమే. దాంపత్యం సాఫీగా సాగాలంటే ఇద్దరి మధ్య అన్యోన్యత ముఖ్యమే. ఒకరిపై మరొకరికి నమ్మకం ప్రధానమే. ఇద్దరి మధ్య సమన్వయం ఉంటే వయసు తేడాలున్నా నష్టమేమీ కాదు. అది మనం వ్యవహరించే తీరును బట్టి ఉంటుంది. మనకు ఎన్నో రకాల ప్రేమలు చూస్తుంటాం. కొందరికి క్రీడాకారులు, మరికొందరికి సినిమా స్టార్లు, ఇంకొందరికి వ్యాపారవేత్తలు కావాలని చూడటం మామూలే. కానీ ఇక్కడో విచిత్రమైన ఆలోచన చేసిందో యువతి. తనకన్నా పెద్దవాడిని పెళ్లి చేసుకోవాలని సంకల్పించి అందరిలో ఆశ్చర్యం నింపింది.
జార్జియాలోని అట్లాంటాలో ఓ యువతి చాలా మంది యువకులతో డేటింగ్ చేసింది. కానీ వారిలో ఎవరు కూడా ఆమెకు ఇష్టం కాలేదు. దీంతో ఆమె విచిత్రమైన నిర్ణయం తీసుకుంది. యాభై సంవత్సరాలు దాటిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. తనను ఎవరు బాగా సుఖపెడితే వారితోనే పెళ్లి అని ప్రకటించడంతో పలువురు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో జీవితంలో సెటిల్ అయిన 67 ఏళ్ల డామియా జేమ్స్ అనే అతడిని ప్రేమించింది. అతడితో ప్రేమాయణం కొనసాగించింది. ఇద్దరిలో ఇష్టం పెరిగిపోయింది. 2017లో పరిచయమైన వీరి మధ్య సంబంధం పెళ్లికి దారి తీయడమే ఆశ్చర్యకరం.

ఆ యువతి యాభై ఏళ్లు దాటిన వారినే పెళ్లి చేసుకుంటానని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో జేమ్స్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. తనను సుఖపెట్టే వారికే ఆ ఆఫర్ అని ప్రకటించడంతో అతడితో ఆమెకు బంధం ఏర్పడింది. ఆమె కోసం ఓ ఇల్లు కూడా కొనుగోలు చేశాడు. అంతే కాదు తిరగడానికి కారు కూడా బహుమతిగా ఇచ్చాడు. ఇద్దరు తరచుగా కలుసుకునే వారు. షాపింగ్ చేసేవారు. ఎక్కడకు వెళ్లినా కలిసే వెళ్లేవారు. వీరి మధ్య ప్రేమ చిగురించడంతో ఇక పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ప్రస్తుతం వీరి పెళ్లి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వయసులో తేడా ఉన్నా మా మధ్య అనుబంధం ఉందని ఆమె చెబుతోంది. తమ బంధం అందరికి విచిత్రంగా తోచినా నాకు మాత్రం బాగుందని తెలిపింది. ప్రేమకు వయసుతో సంబంధం ఉండదని వీరిని చూస్తే తెలుస్తుంది. తమ దాంపత్యంలో ఎలాంటి చిక్కులు లేవు. మా ఇద్దరిలో మంచి అనుబంధం ఏర్పడింది. జీవితాంతం హాయిగా జీవిస్తామనే ధీమా మాలో కలుగుతోంది. అందుకే వివాహ బంధంతో ఒక్కటయ్యాం. దీంతో వీరి బంధం కాస్త అందరిలో ఆశ్చర్యం కలిగిస్తున్నా ఆమె చేసిన పనికి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వారిలో వచ్చిన ప్రేమకు ఎంత బలం ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.