Homeఎంటర్టైన్మెంట్Trivikram-Mahesh Babu: 'త్రివిక్రమ్'తో ఆ జోనర్ సినిమా చేస్తున్నా - మహేష్

Trivikram-Mahesh Babu: ‘త్రివిక్రమ్’తో ఆ జోనర్ సినిమా చేస్తున్నా – మహేష్

Trivikram-Mahesh Babu: ‘మహేష్ – త్రివిక్రమ్’ కలయికలో రాబోతున్న సినిమా కథ పై, ఇప్పటికే ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇదొక రాజకీయ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ డ్రామా అన్నారు, ఆ తర్వాత ఓ జవాన్ కథ ఆధారంగా ఈ సినిమా రాబోతుంది అన్నారు. మధ్యలో ఫ్యాన్స్, ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో మహేష్ సినిమా వస్తోందని సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశారు. అన్నిటికీ మించి, పాన్ ఇండియా సినిమా చేయాలని త్రివిక్రమ్ తాపత్రయ పడుతున్నాడని కామెంట్స్ చేశారు.

Trivikram-Mahesh Babu
Trivikram-Mahesh Babu

ఇంతకీ, ఈ సినిమా ఏ జోనర్ లో రాబోతుంది ? అసలు ఈ సినిమా కథ ఏ అంశం పై సాగనుంది ? ఇలాంటి ప్రశ్నలకు తాజాగా మహేష్ క్లారిటీ ఇచ్చాడు. మహేష్ ఈ రోజు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడారు. ‘మీరు చాలా గ్యాప్‌ తర్వాత త్రివిక్రమ్‌ గారి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఏ జోనర్‌ లో ఈ సినిమా రాబోతుంది ? అని యాంకర్ ప్రశ్న అడిగారు. మహేష్ సమాధానం చెబుతూ.. ‘మా కలయికలో రాబోతున్న సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది.

Also Read: Mahesh Babu Namrata Marriage: ‘నమ్రత’ను పెళ్లి చేసుకుంది అందుకే కదా.. మహేష్ ఓపెన్ స్టేట్ మెంట్

మా కాంబినేషన్‌ అనగానే.. ప్రేక్షకులు డిఫరెంట్‌ గా కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే.. మా సినిమా వైవిధ్యంగా ఉంటుంది. ఎమోషనల్ యాక్షన్ జోనర్ లోనే మా చిత్రం సాగుతుంది’ అని మహేష్ అన్నారు. అలాగే త్రివిక్రమ్ గురించి మహేష్ మాట్లాడుతూ.. ‘ఆయన అద్భుతమైన రచయిత. త్రివిక్రమ్ గారు రాసిన డైలాగ్స్ ను నేను పలుకుతుంటే నాకు వచ్చే ఆ కిక్కే వేరు. అందుకే, నేనెప్పుడూ త్రివిక్రమ్ గారితో చేయబోయే సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’ అని మహేష్ కామెంట్స్ చేశారు.

Trivikram-Mahesh Babu
Trivikram-Mahesh Babu

ఇక ఈ సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా త్రివిక్రమ్ ప్రముఖంగా ప్రస్తావించబోతున్నాడు. ఇది యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యేలా కథను రాశాడట త్రివిక్రమ్. ఇక మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌ లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అతడు సినిమాలోని హీరో రోల్ ‘పార్థు’ను ప్రస్తుతం చేస్తున్న సినిమా టైటిల్‌గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

మొత్తానికి మహేశ్‌ బాబు కొత్త మూవీ టైటిల్ ‘పార్థు’ అంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా యాక్ట్ చేయబోతుంది. ఈ సినిమా పై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఫ్యాన్స్ ను సంతృప్తిపరచడానికి త్రివిక్రమ్ అన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తోంది. దాంతో భారీ సీన్స్ రాయాల్సి వస్తోంది.

Also Read:Mahesh Babu Comments On Bollywood Entry: బాలీవుడ్ ఎంట్రీ పై మహేష్ షాకింగ్ కామెంట్స్
Recommend Videos
చిరంజీవి పై కోట కఠినమైన కామెంట్స్ |Megastar Chiranjeevi |Kota Srinivasa Rao |Oktelugu Entertainment
బిత్తిరి సత్తి మాటలకు పడి పడి నవ్విన  మహేష్ || Sarkaru Vari Pata Interview ||Oktelugu Entertainment
రోజుకు లక్ష ఇస్తే ‘ఊ’ కొట్టేస్తోంది ||Tollywood Actress Shocking Decision || Oktelugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version