Homeఎంటర్టైన్మెంట్Keerthy Suresh Beauty Secrets: కీర్తి సురేష్' అందం వెనుక ఉన్న బ్యూటీ సీక్రెట్స్...

Keerthy Suresh Beauty Secrets: కీర్తి సురేష్’ అందం వెనుక ఉన్న బ్యూటీ సీక్రెట్స్ ఇవే

Keerthy Suresh Beauty Secrets: ‘కీర్తి సురేష్’ అందం వెనుక ఉన్న సీక్రెట్ తెలుసుకోవాలని ఉందా ? అసలు, తన అందం కాపాడుకోవడం కోసం ‘కీర్తి సురేష్’ ఏమి చేస్తోంది ? కీర్తి చాలానే చేస్తోంది. ఎప్పుడూ నిండు పున్నమి వెన్నెలలా అందంగా కనిపించే ‘కీర్తి సురేష్’ తన చంద్రకాంతి లాంటి ముఖాన్ని కాపాడుకోవడానికి చాలా చేస్తాను అంటుంది. ఇంతకీ, ‘కీర్తి సురేష్’ అందం వెనుక ఉన్న బ్యూటీ సీక్రెట్స్, ఆమె ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్ ఏమిటో చూద్దాం.

Keerthy Suresh Beauty Secrets
Keerthy Suresh

‘కీర్తి సురేష్’ పాటించే బ్యూటీ సీక్రెట్స్ :

Also Read: Mahesh Babu Namrata Marriage: ‘నమ్రత’ను పెళ్లి చేసుకుంది అందుకే కదా.. మహేష్ ఓపెన్ స్టేట్ మెంట్

1. డైట్ :

‘కీర్తి సురేష్’కి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం. కానీ, ఆమె వెజిటేరియన్ డైట్ ను ఎక్కువగా ఫాలో అవుతుంది. అలాగే, తన భోజనంలో ఎప్పుడూ రసం ఉండేలా చూసుకుంటుంది. రసం తన శరీరాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచుతుందని ‘కీర్తి సురేష్’ అభిప్రాయం. వేపుళ్ళు, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఎంతో ఇష్టం ఉన్నా.. తన అందమైన శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడం కోసం ‘కీర్తి సురేష్’ వాటికి చాలా దూరం ఉంటుంది.

Keerthy Suresh Beauty Secrets
Keerthy Suresh

2. తాజా చర్మం కోసం ‘కీర్తి సురేష్’ ఏమి చేస్తోందో తెలుసా ?

‘కీర్తి సురేష్’ తరచూ మంచి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు తీసుకుంటుంది. వీటి వల్ల తన చర్మానికి తగినంత తేమ అందుతుందని, అప్పుడు తన స్కిన్ నిత్యం తాజాగా కనిపిస్తుందని ‘కీర్తి సురేష్’ చెబుతుంది.

Keerthy Suresh Beauty Secrets
Keerthy Suresh

3. ఫేస్ పై మచ్చలు రాకుండా ఉండటం ‘కీర్తి సురేష్’ ఏమి చేస్తోంది అంటే ?

‘కీర్తి సురేష్’ ప్రతి రోజూ ఉదయం.. ఐస్ క్యూబ్స్ తో తన ముఖాన్ని మర్దన చేస్తోంది. ఇక షూటింగ్ లేకపోతే అస్సలు మేకప్ జోలికే వెళ్ళదు. పైగా హాని కలిగించే రసాయనాలతో ఉన్న మేకప్ ను, అలాగే రకరకాల హెయిర్ స్టైల్స్ కాకుండా ఎప్పుడూ సింపుల్ గా ఉండటానికే ‘కీర్తి సురేష్’ ఇష్టపడుతుంది.

Keerthy Suresh Beauty Secrets
Keerthy Suresh

4. ‘కీర్తి సురేష్’ వాటికీ పూర్తి దూరం.

స్వీట్స్ ను అమితంగా ఇష్టపడే ‘కీర్తి సురేష్’ వాటికి మాత్రం చాలా దూరంగా ఉంటుంది. అలాగే.. ఆమె బయట ఫుడ్ ను కూడా బాగా ఇష్టపడుతుంది. ఐతే.. తన కొత్త డైట్ కారణంగా ఆమె ప్రస్తుతం అవుట్ సైడ్ ఫుడ్ కి కూడా పూర్తి దూరంగా ఉంటుంది.

Keerthy Suresh Beauty Secrets
Keerthy Suresh

5. అందమైన ఫిజిక్ కోసం కీర్తి చేసేది ఇదే :

‘కీర్తి సురేష్’ జిమ్ లో డైలీ గంట సేపు గడుపుతుంది. నిపుణుడైన ట్రైనర్ పర్యవేక్షణలో ఆబ్ క్రంచెస్, కార్డియో, వెయిట్స్ మరియు ఫ్రీ హాండ్ వంటి వ్యాయామాలను ‘కీర్తి సురేష్’ క్రమం తప్పకుండా చేస్తోంది. అందుకే ‘కీర్తి సురేష్’ ఈ మధ్య చాలా పర్ఫెక్ట్ ఫిజిక్ తో కనిపిస్తోంది.

Also Read:Mahesh Babu Comments On Bollywood Entry: బాలీవుడ్ ఎంట్రీ పై మహేష్ షాకింగ్ కామెంట్స్

Recommend Videos
చిరంజీవి పై కోట కఠినమైన కామెంట్స్ |Megastar Chiranjeevi |Kota Srinivasa Rao |Oktelugu Entertainment
బిత్తిరి సత్తి మాటలకు పడి పడి నవ్విన  మహేష్ || Sarkaru Vari Pata Interview ||Oktelugu Entertainment
రోజుకు లక్ష ఇస్తే ‘ఊ’ కొట్టేస్తోంది ||Tollywood Actress Shocking Decision || Oktelugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

1 COMMENT

Comments are closed.

Exit mobile version