Trivikram-Mahesh Babu: ‘మహేష్ – త్రివిక్రమ్’ కలయికలో రాబోతున్న సినిమా కథ పై, ఇప్పటికే ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇదొక రాజకీయ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ డ్రామా అన్నారు, ఆ తర్వాత ఓ జవాన్ కథ ఆధారంగా ఈ సినిమా రాబోతుంది అన్నారు. మధ్యలో ఫ్యాన్స్, ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో మహేష్ సినిమా వస్తోందని సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశారు. అన్నిటికీ మించి, పాన్ ఇండియా సినిమా చేయాలని త్రివిక్రమ్ తాపత్రయ పడుతున్నాడని కామెంట్స్ చేశారు.

ఇంతకీ, ఈ సినిమా ఏ జోనర్ లో రాబోతుంది ? అసలు ఈ సినిమా కథ ఏ అంశం పై సాగనుంది ? ఇలాంటి ప్రశ్నలకు తాజాగా మహేష్ క్లారిటీ ఇచ్చాడు. మహేష్ ఈ రోజు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడారు. ‘మీరు చాలా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఏ జోనర్ లో ఈ సినిమా రాబోతుంది ? అని యాంకర్ ప్రశ్న అడిగారు. మహేష్ సమాధానం చెబుతూ.. ‘మా కలయికలో రాబోతున్న సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది.
Also Read: Mahesh Babu Namrata Marriage: ‘నమ్రత’ను పెళ్లి చేసుకుంది అందుకే కదా.. మహేష్ ఓపెన్ స్టేట్ మెంట్
మా కాంబినేషన్ అనగానే.. ప్రేక్షకులు డిఫరెంట్ గా కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే.. మా సినిమా వైవిధ్యంగా ఉంటుంది. ఎమోషనల్ యాక్షన్ జోనర్ లోనే మా చిత్రం సాగుతుంది’ అని మహేష్ అన్నారు. అలాగే త్రివిక్రమ్ గురించి మహేష్ మాట్లాడుతూ.. ‘ఆయన అద్భుతమైన రచయిత. త్రివిక్రమ్ గారు రాసిన డైలాగ్స్ ను నేను పలుకుతుంటే నాకు వచ్చే ఆ కిక్కే వేరు. అందుకే, నేనెప్పుడూ త్రివిక్రమ్ గారితో చేయబోయే సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’ అని మహేష్ కామెంట్స్ చేశారు.

ఇక ఈ సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా త్రివిక్రమ్ ప్రముఖంగా ప్రస్తావించబోతున్నాడు. ఇది యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యేలా కథను రాశాడట త్రివిక్రమ్. ఇక మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అతడు సినిమాలోని హీరో రోల్ ‘పార్థు’ను ప్రస్తుతం చేస్తున్న సినిమా టైటిల్‌గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి మహేశ్ బాబు కొత్త మూవీ టైటిల్ ‘పార్థు’ అంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా యాక్ట్ చేయబోతుంది. ఈ సినిమా పై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఫ్యాన్స్ ను సంతృప్తిపరచడానికి త్రివిక్రమ్ అన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తోంది. దాంతో భారీ సీన్స్ రాయాల్సి వస్తోంది.
Also Read:Mahesh Babu Comments On Bollywood Entry: బాలీవుడ్ ఎంట్రీ పై మహేష్ షాకింగ్ కామెంట్స్
Recommend Videos