Siddharth: తెలుగు సినిమా ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు సిద్ధార్థ్… ఒకప్పుడు ఆయన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా హీరోగా చాలా సంవత్సరాల పాటు తన కెరీర్ ని కొనసాగించిన సిద్ధార్థ్ ఇప్పుడు మాత్రం మంచి సినిమాలను చేయడంలో చాలావరకు తడబడుతున్నాడు. సక్సెస్ ఫుల్ సినిమాలను చేయాలనే ఉద్దేశ్యం లో ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలను చేస్తున్నప్పటికి అవి ఏవి ప్రేక్షకులను అలరించడం లేదు. ఇక ఆయన కెరీర్ మొదట్లో చేసిన నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత కొద్ది రోజులపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇక ఇప్పుడు భారతీయుడు 2, చిన్నా లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి అవి ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆయన కెరియర్ అనేది మళ్ళి డైలమాలో పడింది. ఇక ఇదిలా ఉంటే ఒకానొక టైమ్ లో ఆయనకు ‘పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాడర్’ అనే వ్యాధితో ఇబ్బంది పడ్డాడట…దాని నుంచి బయటపడడానికి 7 నుంచి 8 సంవత్సరాల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారని చెప్పాడు.
తను స్టార్ హీరోగా మంచి స్టేటస్ ని అనుభవిస్తున్న సందర్భంలో ఈ డిజార్డర్ తో బాధపడడం వల్ల తను హ్యాపీగా ఉన్న సిచువేషన్ కంటే ఆ వ్యాధి గురించి బాధపడుతున్న సందర్భాలే చాలా ఎక్కువ ఉంటాయని ఆయన చెబుతున్నాడు…తన అభిమానులను కలిసిన ప్రతిసారి తను స్ట్రెస్ లోనయ్యేవాడినని అసలు ఎందుకీల అవుతుందని తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతోనే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు టెస్ట్ లు చేసి ఇలాంటి డిజార్డర్ ఉందని చెప్పారట.
ఇక మొత్తానికైతే హ్యాపీగా ఉండే సిచువేషన్స్ ఎంజాయ్ చేయడానికి కూడా తనకు ఈ డిసార్డర్ చాలా వరకు ఇబ్బంది అనిపించేదని తెలియజేశాడు. ఇక ఏది ఏమైనా కూడా సిద్ధార్థ ఇప్పుడు తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడిగా మిగిలిపోయాడు.
మరి తొందరలోనే మరికొన్ని సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సక్సెస్ లను సాధించి మరోసారి పూర్వ వైభవాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఆయన అనుకున్న రేంజ్ లో సక్సెస్ లను సాధిస్తాడా లేదా అనేది…