Manchu Manoj and Allu Arjun : సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కోరుకుంటారు. ఇక ఎంత వారసత్వంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చినా కూడా వాళ్ల టాలెంట్ చూపిస్తేనే ఇక్కడ సర్వైవల్ అవుతారు. లేకపోతే మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోవాల్సిన పరిస్థితి రావచ్చు…ఇక ఏది ఏమైనా తనదైన రీతిలో నటించి మెప్పించగలిగే సత్తా ఉన్న నటీనటులు ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటారనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కి మంచి నటుడిగా చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఒకప్పుడు ఆయన విలక్షణమైన నటుడిగా పేరు సంపాదించుకోవడమే కాకుండా హీరోగా కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘పెద రాయుడు’ సినిమాతో దాదాపు ఇండస్ట్రీ హిట్టు కొట్టినంత పని చేసిన మోహన్ బాబు స్టార్ హీరోల లిస్టులో చేరిపోయారు. మరి అప్పట్నుంచి తన ప్రస్తానాన్ని భారీగా మొదలు పెట్టాలని అనుకున్న కూడా ఆ తర్వాత అతనికి పెద్దగా సక్సెస్ లు రాకపోవడంతో హీరోగా అవకాశాలు రాలేదు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఇక ఒకప్పుడు తనదైన రీతిలో సత్తా చాటుకుంటు ముందుకు దూసుకెళ్లిన మోహన్ బాబు అటు సినిమాల పరంగా, ఇటు కెరియర్ పరంగా కొంతవరకు డల్ అయ్యాడనే చెప్పాలి. ఇక పర్సనల్ విషయాల్లో వస్తే తన కొడుకుల విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు…
ఇక ఇదిలా ఉంటే తన చిన్న కొడుకు అయిన మంచు మనోజ్ కి నటన పరంగా మంచి టాలెంట్ అయితే ఉంది. ఇక మోహన్ బాబు లానే మనోజ్ కూడా మంచి నటుడు అవుతాడని అందరూ అనుకున్నారు. ఇక ఆయన కూడా వరుసగా మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం అయితే చేశాడు.
కానీ అంతలోనే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడు. మరి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో కొన్ని సినిమాల్లో విలన్ గా నటించడానికి అవకాశాలనైతే అందుకుంటున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది ఇక ప్రస్తుతం పుష్ప 2 తో అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ ను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
అన్నీ కుదిరితే మంచు మనోజ్ కూడా అల్లు అర్జున్ రేంజ్ కి వెళ్లి పోవాల్సిన వాడు కానీ కావాలనే అతన్ని సరైన సినిమాలు చేయకుండా తన అన్న అయిన విష్ణు, మోహన్ బాబు అడ్డుకున్నారని కొంతమంది కొన్ని ఆరోపణలైతే చేస్తూ ఉంటారు. మరి సొంత తండ్రి కొడుకు మీద అలాంటి చర్యలు ఎందుకు చేస్తాడు అని వాదించేవారు కూడా ఉన్నారు. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి మోహన్ బాబు విష్ణు కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ మనోజ్ కి అయితే ఇవ్వలేదనే చెప్పాలి. దాని ద్వారా మనోజ్ కెరియర్ అనేది డౌన్ ఫాల్ అయిపోయింది…