https://oktelugu.com/

Tamannaah: తమన్నా కాబోయే భర్తకి ఇలాంటి వింత వ్యాధి ఉందా..చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుందిగా!

ఎవరు ఈ విజయ్ వర్మ అని అతని గురించి గూగుల్ లో వెతికితే, ఆయన నేచురల్ స్టార్ నాని నటించిన 'MCA' చిత్రంలో విలన్ నటించాడని, అలాగే బాలీవుడ్ మంచి పాపులారిటీ ఉన్న నటుడని తెలిసింది. అంతే కాదు తమన్నా అతనితో కలిసి 'ది లస్ట్ స్టోరీస్ 2' అనే చిత్రం చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 31, 2024 / 03:46 PM IST

    Does Tamannaah future husband have this strange disease

    Follow us on

    Tamannaah: సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ స్టేటస్ తెచ్చుకున్న నలుగురు హీరోయిన్స్ లో ఒకరు తమన్నా. కేవలం ఈమె పేరు మీద ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించేంత సత్తా ఉంది కాబట్టే ఆమెతో బడా నిర్మాతలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు కూడా ముందుకు వస్తున్నారు. ఇక ఆమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పాలరాతి శిల్పం లాంటి రూపం, అద్భుతమైన నటన, మైమరపించే డ్యాన్స్ ఆమె సొంతం. అందుకే ఆమెని అభిమానులు దేవకన్యతో పోల్చి చూస్తారు. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని అబ్బాయిలు కలలు కంటూ ఉంటారు. అయితే కోట్లాది మంది కుర్రాళ్ళ గుండెలు బద్దలు అయిపోయేట్టు కొంతకాలం క్రితం ఈమె ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ని పెళ్లి చేసుకోబోతున్నాను అని ప్రకటించింది.

    ఎవరు ఈ విజయ్ వర్మ అని అతని గురించి గూగుల్ లో వెతికితే, ఆయన నేచురల్ స్టార్ నాని నటించిన ‘MCA’ చిత్రంలో విలన్ నటించాడని, అలాగే బాలీవుడ్ మంచి పాపులారిటీ ఉన్న నటుడని తెలిసింది. అంతే కాదు తమన్నా అతనితో కలిసి ‘ది లస్ట్ స్టోరీస్ 2’ అనే చిత్రం చేసింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమాకి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఇందులో తమన్నా విజయ్ వర్మతో చేసిన రొమాంటిక్ సన్నివేశాలు సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేసింది. ఇప్పటికీ ఆ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే విజయ్ వర్మ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తమన్నా తో రిలేషన్ గురించి చెప్పుకొచ్చిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘నాకు ఏ విషయాన్నీ కూడా దాచిపెట్టడం ఇష్టం లేదు. అందుకే తమన్నా తో రిలేషన్ లో ఉన్న విషయాన్నీ ముందుగా నేనే బయటపెట్టాను. అలా అని ప్రతీ విషయాన్నీ నేను అభిమానులతో షేర్ చెయ్యలేను. ఉదాహరణకి నేను తమన్నా కలిసి 500 కి పైగా ఫోటోలు దిగాము. అవి మా వ్యక్తిగత ఫోటోలు కాబట్టి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

    ఇక తనకి ఉన్న వ్యాధి గురించి చెప్తూ ‘నాకు బొల్లి ఉంది. ఈ విషయాన్ని తమన్నా కి ముందుగానే చెప్పాను. తను నాకు ఉన్న ఆ బొల్లి వ్యాధిని కూడా అంగీకరించింది. అయితే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో నాకు ఈ వ్యాధి ఉంది అనే విషయం ఎవరికీ చెప్పలేదు. ఒకవేళ నేను చెప్పి ఉండుంటే అందరూ నాకు ఉన్నటువంటి ఆ బొల్లి వ్యాధినే చూసేవారు కానీ, నా నటనను ఎవరూ చూసేవాళ్ళు కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా ఈ జంట ఈ ఏడాది చివర్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే తమన్నా అభిమానులు మాత్రం బొల్లి ఉన్న ఒక వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమిటి?, నీ స్థాయి వేరు స్థానం వేరు, అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు