Allu Arjun: పాన్ ఇండియా సినిమాలు చేసే ప్రతీ ఒక్కరు పాన్ ఇండియన్ స్టార్స్ కాదు. వాళ్ళ సినిమాలు ఇతర రాష్ట్రాల్లో ఆడాలంటే కచ్చితంగా కంటెంట్ ఉండాల్సిందే. లేకుంటే ఘోరమైన డిజాస్టర్ ని మన చేతుల్లో పెడుతారు. ఉదాహరణకి ప్రభాస్ ని తీసుకుంది. బాహుబలి సిరీస్ తర్వాత ‘సాహో’ చిత్రంతో నెగటివ్ టాక్ మీద హిందీ లో 170 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టాడు. కానీ అదే ప్రభాస్ తన తదుపరి చిత్రం రాధేశ్యామ్ కి కనీసం పాతిక కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయాడు. ఇలా ఉంటుంది బాలీవుడ్ లో పరిస్థితి. కానీ ఎలాంటి టాక్ వచ్చిన కనీసం మూడు రోజులు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు నాన్ స్టాప్ హౌస్ ఫుల్స్ పెట్టగలిగే సత్తా ఇప్పుడు ఉన్న హీరోలలో అల్లు అర్జున్ కి మాత్రమే ఉంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. పుష్ప చిత్రం ఆయనకీ ఆ రేంజ్ స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టింది.
పుష్ప కంటే ముందు నుండే అల్లు అర్జున్ కి బాలీవుడ్ లో మంచి పాపులారిటీ ఉంది. అలాగే తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి ప్రాంతాలలో కూడా అల్లు అర్జున్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. కేరళ లో అల్లు అర్జున్ అభిమానులకు కూడా తెలియని అల్లు అర్జున్ స్టామినా ఏంటో ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా మీకు తెలియచేయబోతున్నాము. ‘గంగోత్రి’ చిత్రం సూపర్ హిట్ అయిన తర్వాత, ఆయన హీరోగా నటించిన ఆర్య, బన్నీ చిత్రాలు కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇలా హ్యాట్రిక్ హిట్ కొట్టి మంచి ఊపు మీదున్న అల్లు అర్జున్ కి ‘హ్యాపీ’ చిత్రం స్పీడ్ బ్రేకర్ లాగా నిల్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అప్పట్లో యావరేజి టాక్ ని తెచ్చుకొని కమర్షియల్ గా ఫ్లాప్ సినిమాగా మిగిలింది. సినిమా మొత్తం బాగానే ఉన్నప్పటికీ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్స్ ఆడియన్స్ కి సరిగా కనెక్ట్ అవ్వకపోవడంతో ఈ సినిమాకి ఆ ఫలితాన్ని కట్టబెట్టింది. అయితే ఇదే సినిమాని కొన్ని రోజులు అయ్యాక మలయాళం లో దబ్ చేసి గ్రాండ్ గా విడుదల చేసారు. అక్కడ ఈ చిత్రం మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని బంపర్ వసూళ్లను రాబడుతూ దాదాపుగా 175 రోజులు థియేటర్స్ లో విజయవంతంగా ఆడింది.
ఈ సినిమాతోనే అల్లు అర్జున్ కి కేరళలో మార్కెట్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత ఆయన మొదటి మూడు చిత్రాలు కూడా కేరళలో విడుదలై సూపర్ హిట్స్ అయ్యాయి. అప్పటి నుండి అల్లు అర్జున్ ప్రతీ తెలుగు సినిమా మలయాళం లోకి దబ్ అయ్యి విడుదల అవ్వడం కారణంగా ఆయన అల్లు అర్జున్ నుండి మల్లు అర్జున్ గా మారిపోయాడు. అలా కేవలం కేరళలో మాత్రమే కాదు కర్ణాటక, తమిళనాడు మరియు నార్త్ ఇండియన్ స్టేట్స్ లో కూడా అల్లు అర్జున్ ఇదే రేంజ్ క్రేజ్ ని తెచ్చుకున్నాడు. కాబట్టి అల్లు అర్జునే అసలు సిసలు పాన్ ఇండియన్ స్టార్ అని ట్రేడ్ పండితులు అంటున్నారు.