Spirit movie latest updates: ప్రభాస్ తన సినిమాలతో కొన్ని కోట్ల మందిని తన అభిమానులను సంపాదించుకున్నాడు… ప్రస్తుతం బోల్డ్ కంటెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు… వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అనగానే ప్రేక్షకుల తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ సైతం ఒక్కసారి గా ఉలిక్కి పడింది…భారీ కటౌట్ తో గూండాలను చీల్చి చెండాడే ప్రభాస్ కి రూత్ లెస్ సందీప్ రెడ్డి వంగ దొరికితే ఆ బొమ్మ ఎలా ఉంటుందే మనం ఊహించుకోవచ్చు… ఇప్పటివరకు ప్రభాస్ చేసిన సినిమాలన్నీ అతన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. స్పిరిట్ సినిమా ప్రభాస్ ను నెంబర్ వన్ హీరోగా మారుస్తోంది…ఇక ఈ సినిమాని రీసెంట్ గా స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. తొందర్లోనే రెగ్యూలర్ షూట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా కోసం చాలా కేర్ తీసుకున్నాడట. మొత్తానికైతే ఈ సినిమా సక్సెస్ అవ్వాలంటే ఈ సినిమాలో ఈ మూడు ఉండాల్సిందే అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇంతకీ అవేంటంటే ప్రభాస్ రేంజ్ లో ఎలివేషన్స్ ఉండాలి… అలాగే సందీప్ స్టైల్లో యూత్ ని ఆకట్టుకునే కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉండాలి…
ఎమోషన్ ని కూడా ప్రాపర్ గా వర్క్ అవుట్ చేసినట్లయితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ లో సక్సెస్ అవుతోంది. అలాగే 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను ఈజీగా సంపాదించి పెడుతుందని ప్రతి ఒక్కరు వాళ్ళ ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ ని రాబడుతోంది అనేది మాత్రం చాలా కీలకంగా మారబోతోంది… ప్రభాస్ తన స్టామినా చూపించి మరోసారి సూపర్ హిట్ సాధించి రెండు వేల కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…