రాధేశ్యామ్ మరీ స్లోగా ఉన్నాడు. సరే, ఇప్పుడు ఆ సాంగ్ పరిస్థితి ఏమిటి ? షూట్ చేయాలా ? లేక వదిలేద్దామా ? అనే డైలమాలో దర్శకుడు రాధాకృష్ణ ఉన్నాడు. ఇది రొమాంటిక్ సాంగ్ కాబట్టి, కచ్చితంగా చేయాలి అంటున్నారు నిర్మాతలు. కానీ, ప్రభాస్ మాత్రం ఇప్పటికే దర్శకుడి పనితనంపై అసంతృప్తిగా ఉన్నాడు. షూట్ బాగా లేట్ చేశాడు అనేది ప్రభాస్ అభిప్రాయం.
ఇలాంటి టైంలో ప్రభాస్ దగ్గరకు వెళ్లి.. ఈ సాంగ్ ఉందని చెప్పడానికి భయపడుతున్నాడు రాధాకృష్ణ. కానీ, ఇంతకుమించి అతనికి ఇంకో ఆప్షన్ కనిపించడం లేదు. ఈ పాటను యాడ్ చేస్తేనే.. లవ్ స్టోరీలో డెప్త్ ఉంటుంది. సినిమాలో రొమాంటిక్ లుక్ అండ్ ఫీల్ వస్తుంది. అందుకే ఎలాగైనా ఈ సాంగ్ షూట్ ను ఈ నెల చివర్లో షూట్ చేయాలని దర్శకుడు ఉబలాట పడుతున్నాడు.
మరి ప్రభాస్ రియాక్షన్ ఎలా ఉంటుందో ? అసలు ప్రభాస్ పాట షూట్ చేద్దాం అంటే ఒప్పుకుంటాడా ? అసలుకే ప్రభాస్ సినిమాల లిస్ట్ పెద్దగా ఉంది. పైగా రొమాంటిక్ సాంగ్. ఇలాంటి సాంగ్స్ అంటే ప్రభాస్ కి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి, ఈ సాంగ్ షూట్ కి ప్రభాస్ ఒప్పుకోడు అనేది ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. చూస్తుంటే రాధేశ్యామ్ ఇప్పట్లో పర్ఫెక్ట్ అనిపించుకునేలా లేడు.