మోడీ నోట ‘బాహుబలి’ మాట

దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన ‘బాహుబలి’ సినిమా ఘనత ఇప్పటికీ ఇనుమడిస్తూనే ఉంది. ఆ సినిమా భారత సినిమా ఇండస్ట్రీనే షేక్ చేసింది. రికార్డు కలెక్షన్లు సాధించింది. ఎంతో మందిని కదిలించింది. ఇప్పటికీ దేశ ప్రజల్లో నానుతూనే ఉంది. తాజాగా ప్రధాని మోడీ కూడా ‘బాహుబలి’ని గుర్తు చేసుకోవడం విశేషం. కోవిడ్19 వ్యాక్సిన్ తీసుకుంటే బాహుబలి అంత స్ట్రాంగ్ గా ఉంటారని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. కోవిడ్ వ్యతిరేక పోరాటంలో 40 కోట్ల మంది ప్రజలు వ్యాక్సిన్ […]

Written By: NARESH, Updated On : July 20, 2021 5:28 pm
Follow us on

దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన ‘బాహుబలి’ సినిమా ఘనత ఇప్పటికీ ఇనుమడిస్తూనే ఉంది. ఆ సినిమా భారత సినిమా ఇండస్ట్రీనే షేక్ చేసింది. రికార్డు కలెక్షన్లు సాధించింది. ఎంతో మందిని కదిలించింది. ఇప్పటికీ దేశ ప్రజల్లో నానుతూనే ఉంది. తాజాగా ప్రధాని మోడీ కూడా ‘బాహుబలి’ని గుర్తు చేసుకోవడం విశేషం.

కోవిడ్19 వ్యాక్సిన్ తీసుకుంటే బాహుబలి అంత స్ట్రాంగ్ గా ఉంటారని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. కోవిడ్ వ్యతిరేక పోరాటంలో 40 కోట్ల మంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకొని బాహుబలులుగా మారారంటూ మోడీ అభివర్ణించారు.

పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా సోమవారం ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీకా ప్రాముఖ్యత గురించి వివరించారు.ఈ సందర్భంగా ప్రధాని నోట మరోసారి బాహుబలి ప్రస్తావన వచ్చింది. గతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో బహుబలి సినిమా ప్రస్తావనను మోడీ అనేక సార్లు తీసుకొచ్చారు.

మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా వర్షం కురుస్తుండడంతో నరేంద్రమోడీ తన గొడుగు తానే పట్టుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష సభ్యులు కఠిన ప్రశ్నలు వేస్తూ సభ సజావుగా సాగేలా సహకరించాలన్నారు. ప్రభుత్వం అన్ని విషయాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. కరోనా కట్టడిని అందరితో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.