Car Is Going To Be Updated From Maruti: మారుతి నుంచి అప్డేట్ కాబోతున్న ఈ కారు.. ధర.. ఫీచర్స్ ఇవీ

దేశంలో మారుతి కార్లకు నిత్యం డిమాండ్ ఉంటుంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ప్రీమియం కార్ల వరకు అన్ని రకాల వేరియంట్లను అందుబాటులో ఉంచడంలో మారుతి కంపెనీ ముందు ఉంటుంది. ఈ కంపెనీ నుంచి దశాబ్దం కిందట రిలీజ్ అయిన కొన్ని కార్లు ఇప్పటికీ విక్రయాలు జరుపుకుంటుందటే ఈ కంపెనీకి ఎంత ప్రాధాన్యం ఉందో తెలుసుకోవచ్చు.

Written By: Srinivas, Updated On : October 28, 2024 12:15 pm

Maruthi-Suzuki

Follow us on

Car Is Going To Be Updated From Maruti:దేశంలో మారుతి కార్లకు నిత్యం డిమాండ్ ఉంటుంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ప్రీమియం కార్ల వరకు అన్ని రకాల వేరియంట్లను అందుబాటులో ఉంచడంలో మారుతి కంపెనీ ముందు ఉంటుంది. ఈ కంపెనీ నుంచి దశాబ్దం కిందట రిలీజ్ అయిన కొన్ని కార్లు ఇప్పటికీ విక్రయాలు జరుపుకుంటుందటే ఈ కంపెనీకి ఎంత ప్రాధాన్యం ఉందో తెలుసుకోవచ్చు. అయితే మారుతి కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన కొన్ని కార్లకు డిమాండ్ ఉన్నా.. వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ వెర్షన్ గా మార్చి మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇప్పటికే ఓ కారు కోసం వినియోగదారులు ఎగబడుతున్నా.. దానిని అప్డేట్ చేస్తూ లాంచ్ చేయనుంది. దీపావళి తరువాత నవంబర్ లో ఈ కారు బయటకు రానుంది. అయితే ఆ కారు ఏది? అది ఎలా ఉండబోతుంది?

మారుతి నుంచి రిలీజ్ అయిన డిజైర్ కారును ఎక్కువ మంది కోరుకుంటున్నారు. వ్యాగన్ ఆర్, స్విప్ట్ తరువాత డిజైర్ అమ్మకాల్లో మిగతా కార్లకు ఎక్కువ పోటీ ఇస్తోంది. ఈ కారుకు డిమాండ్ ఉన్నప్పటికీ లెటేస్ట్ వెర్షన్ తో నవంబర్ 11న అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం వినియోగదారుల అభిరుచులు మారిపోతున్నాయి. కొత్త టెక్నాలజీతో కూడిన కార్లను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు అప్డేట్ వెర్షన్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటి వరకు ఉన్న కారులో కొన్ని మార్పులు చేసి ఆకట్టుకునే విధంగా మార్చనున్నారు. అయితే లెటేస్ట్ వెర్షన్ లో రాబోతున్న డిజెర్ ఎలా ఉంటుందంటే?

సెడాన్ వేరియంట్ లో ఉన్న డిజైర్ ఎస్ యూవీని పోలీ ఉంటుంది. ఇందులో బూట్ స్పేస్ ఎక్కువగా ఉండడంతో లగ్జరీ లెవల్లో ఉండాలని అనుకునేవారు డిజైర్ ను ఎక్కువగా కొనుగోలు చేశారు. ఇందులో 1.2 లీటర్ నేచురల్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ పై 82 బీహెచ్ పీ పవర్, 108 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే ఈ మోడల్ లీటర్ పెట్రోల్ కు 32 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో సీఎన్ జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

మారుతి డిజైర్ ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఈ కారు ముందు భాగంలో గ్రిల్ బంఫర్, ఎల్ ఈడీ లైట్లు, ఫాగ్ లైట్స్ ఆకట్టుకుంటాయి. అలాగే అల్లాయ్ వీల్స్, ఎల్ ఈడీ టెయిల్ టైల్స్ సెటప్ ను కలిగి ఉంటాయి. ఇన్నర్ విషయానికొస్తే 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆటేమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఆకట్టుకుంటాయి. అలాగే టైప్ సి ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు సన్ రూప్ రియర్ పార్కింగ్ ఏసీ ఫీచర్ వంటివి ఆకట్టుకుంటాయి.

అయితే కొత్తగా వచ్చే కార్లలో కొన్ని మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఉన్న డిజైన్ కాకుండా కొత్తగా ఆకర్షించే విధంగా ఉండనుంది. అలాగే ఎక్సీటీయర్లో కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా ముందు భాగంలో ఉండే గ్రిల్, బంపర్, ఎల్ ఈడీ లైట్లు కొత్తగా కనిపించే అవకాశం ఉంది. అలాగే కొత్త కారు లీటర్ పెట్రోల్ కు 32 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే విధంగా అప్ గ్రేడ్ చేశారు. అయితే పాత కారు ధరతోనే విక్రయిస్తూ వినియోగదారులను ఆకర్షించే విధంగా కొత్త జనరేషన్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ సెడాన్ ను రూ.6.70 లక్షలతో విక్రయించే అవకాశం ఉంది. 5 సీటర్ వెర్షన్ లో అందుబాటులోకి రాబోతున్న ఇది మొత్తం బ్లూ బ్లాక్, మాగ్మా గ్రే, స్పెండెడ్ సిల్వర్ వంటి కొత్త కలర్లలో అందుబాటులో ఉండనుంది.