Mahesh Babu: మహేష్ బాబు కి ఆ విషయంలో ఫోబియా ఉందా..? ఎందుకు అంతలా భయపడుతాడు..?

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా పేరు సంపాదించుకున్నాడు.

Written By: Gopi, Updated On : August 22, 2024 3:34 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి… తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న మహేష్ బాబు తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్ళడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి…ఇక మీదట కూడా సూపర్ హిట్స్ సాధించి ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరోగా ఎదుగుతాడని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు…

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా పేరు సంపాదించుకున్నాడు. ఇక రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఈ సినిమా కోసమే ప్రస్తుతం తను మేకోవర్ లో బిజీగా ఉన్నాడు. ఒక్కో టైమ్ లో ఒక్కో గెటప్ లో కనిపిస్తున్న మహేష్ బాబు అసలు రాజమౌళి సినిమా కోసం ఏ గెటప్ ని ఫైనల్ చేశారు అనే విషయంలో మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నప్పటికీ ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది, ఎప్పుడు థియేటర్లోకి వస్తుంది అనే విషయం తెలియక మహేష్ బాబు అభిమానులు తీవ్రమైన నిరాశ చెందుతున్నారు. దీనిపైన సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో జక్కన్న మీద వాళ్ళు కొన్ని విమర్శలను కూడా చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా మీద సరైన క్లారిటీ ఇవ్వడానికి రాజమౌళి తొందర్లోనే రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కి ఒక విషయంలో ఫోబియా ఉందని కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఆయనకి హెవీగా వాటర్ ని చూస్తే కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అవుతుందట.

అంటే సముద్రం దగ్గర గాని లేదా సరస్సుల వద్ద గాని ఆయన ఉన్నప్పుడు ఏదో తెలియని భయం కలుగుతుందని కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అలాంటి ఫోబియాతో అయినా చాలా సంవత్సరాల పాటు ఇబ్బంది పడుతూ వస్తున్నారు. మరి ఇప్పటికైతే అలాంటిది ఏది లేదు అంటూ కొన్ని అతని సన్నిహితులు తెలియజేస్తున్నారు.

ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులు మాత్రం సముద్రం, సరస్సులను చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది అది కామన్…అది అసలు ఫోబియానే కాదు అంటూ వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లైతే చేస్తున్నారు. ఇక మొత్తానికైతే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకి కూడా కొంతవరకు ఫోబియా అనేది ఉంది అంటూ మరికొంతమంది కామెంట్లు చేయడం విశేషం…

ఇక ఏది ఏమైనప్పటికీ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో గుర్తింపు పొందుతున్న మహేష్ బాబు వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటాలని అలాగే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని నెక్స్ట్ లెవల్లో నిలపాలని కోరుకుందాం…