Buchibabu And Srikanth Odela: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఎన్నో రోజులపాటు అహర్నిశలు కష్టపడి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు పైకెక్కుతూ క్రేజ్ ను సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. అలాంటి వాళ్లకు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు తమ మనుగడను సాగించే అవకాశం కూడా ఉంటుంది…ఇక చాలామంది డైరెక్టర్లు టాప్ పొజిషన్ ని టచ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని తమవైపు తిప్పుకుంటున్న దర్శకులు చాలామంది ఉన్నారు. అందులో సుకుమార్ ఒకరు. సుకుమార్ తన శిష్యులను చాలా బాగా చూసుకుంటాడు. వాళ్లలో టాలెంట్ ఉంటే వాళ్ళను తప్పకుండా ఎంకరేజ్ చేసి స్టార్ డైరెక్టర్లుగా మార్చడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే అతని దగ్గర బుచ్చిబాబు ‘రంగస్థలం’ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అయితే బుచ్చిబాబు మొదటి నుంచి సుకుమార్ దగ్గర ఉండటం వల్ల అతను సీనియర్ పొజిషన్లో ఉంటాడు. శ్రీకాంత్ ఓదెల సైతం ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండటంతో వీళ్లిద్దరి మధ్య కొంతవరకు విభేదాలైతే వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. అందువల్లే శ్రీకాంత్ ఓదెలను బుచ్చిబాబు పట్టించుకునేవాడు కాదట. వీళ్ళిద్దరికి అసలు పడేది కాదట. మొత్తానికైతే శ్రీకాంత్ ఓదెల దసర సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధించడం మనందరికి తెలిసిందే.
ఇక ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాని 2026 వ సంవత్సరం మార్చి 26వ తేదీన రిలీజ్ చేస్తానంటూ అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత బుచ్చిబాబు రామ్ చరణ్ తో చేస్తున్న ‘పెద్ది’ సినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేసి తను కూడా 2026 మార్చి 26వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాను అంటూ అనౌన్స్ చేశాడు.
శ్రీకాంత్ ఓదెల అంటే తనకు నచ్చదు కాబట్టే బుచ్చిబాబు ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని అదే రోజున తన సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అలా చేస్తే పెద్ది స్టార్ హీరో సినిమా కాబట్టి శ్రీకాంత్ ఓదెల తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంటాడని బుచ్చిబాబు భావిస్తున్నాడు.
కానీ శ్రీకాంత్ ఓదెల సైతం అదే డేట్ కి తన సినిమాను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతూ నాలుగు గంటల పాటు నిద్రపోతున్నారట… ఎలాగైనా సరే సినిమాని అనుకున్న టైం కి బరిలోకి దింపాలనే ప్రయత్నం చేస్తున్నాడు… మరి ఈ ఇద్దరి మధ్య పోటీలో ఎవరు విజయాన్ని సాధిస్తారనేది తెలియాల్సి ఉంది…