Bhola Shankar: సూపర్ స్టార్ రజనీకాంత్ ఇష్టపడి హీరోగా చేసిన సినిమా ‘పెద్దన్న’. కథ అద్భుతం.. సినిమాలో గొప్ప ఎమోషన్స్ ఉన్నాయి అంటూ రజినీ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే.. ఇది అద్భుతమైన కథ కాదు, ఆ నాటి రొటీన్ కథ అని తేలిపోయింది. ఇక సినిమాలో ఎమోషన్స్ విషయానికి వస్తే.. ప్రేక్షకులకు అవి ఎమోషన్స్ కావు, ఇరిటేషన్స్ అని అర్ధం అయిపోయింది.

మొత్తానికి గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దన్న.. బాక్సాఫీస్ వద్ద చిన్న అన్న పాత్ర కూడా పోషించలేక పోయాడు. అసలు చాలాకాలం తరవాత రజనీ తనస్టైల్ లో చేసిన పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ఇది. అయినా ఎందుకో.. రజినీ అభిమానులకు కూడా ఈ చిత్రం నచ్చలేదు. దీనికి మరో కారణం కూడా కనిపిస్తుంది. ఈ సినిమా పై ముందు నుంచీ రజినీ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.
దాంతో సినిమా పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఆ భారీ అంచనాల మధ్య రజనీ ఓ రొడ్డకొట్టుడు సెంటిమెంట్ కథతో వచ్చి బాగా నిరాశ పరిచాడు. అయినా ఈ సినిమా దర్శకుడు శివ.. గతంలో ఇదే పాయింట్ తో ఇతగాడు వేదాళం అనే సినిమా చేశాడు. మరి మళ్ళీ అదే పాయింట్ తో ఎందుకు రజినీతో సినిమా చేశాడో అర్ధం కావడం లేదు.
పైగా సిస్టర్ సెంటిమెంట్ కథలు ఇప్పటికే ఎన్నో వచ్చాయి. ఇప్పుడు ఇదే భయం మెగాస్టార్ ‘భోళా శంకర్’ టీమ్ కి కూడా పట్టుకుంది. ఎందుకంటే భోళా శంకర్ వేదాళంకు రీమేక్. ఈ సినిమా కథ కూడా సిస్టర్ సెంటిమెంట్ మీదే ఆధారపడి సాగుతుంది. దీనికితోడు ఇదే కథను అటూ ఇటూ మార్చి పెద్దన్నలా తీశాడు దర్శకుడు శివ.
Also Read: Pushpa – Akhanda: ‘అఖండ, పుష్ప’ పరిస్థితి ప్రస్తుతం అయోమయం !
కానీ పెద్దన్న పల్టీ కొట్టడంతో.. ఇప్పుడు భోళా శంకర్ పై ఆ ప్లాప్ ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. పెద్దన్న, భోళా శంకర్ రెండూ ఓకే పాయింట్ తో సాగే కథలు. పైగా రెండు సినిమాల్లోనూ హీరో చెల్లాయిగా కీర్తి సురేషే నటించింది. ఇప్పుడు ఇది కూడా అతి పెద్ద సమస్య అయింది. మరి భోళా శంకర్ కి కూడా పెద్దన్న గతే పడుతుందా ? చూడాలి.
Also Read: Shyam Singaray: శ్యామ్ సింగరాయ్.. ఎగసిపడే అలజడి వాడు.. ఆకట్టుకుంటున్న లిరికల్ సాంగ్!