Karthika Deepam Doctor Babu: తెలుగు సీరియళ్లలో ‘కార్తీక దీపం’ అత్యధిక వ్యూయర్ షిప్ తో మొన్నటివరకూ నంబర్ 1గా నిలిచింది. ‘వంటలక్క’కు న్యాయం చేయాలని ఏకంగా సంఘాలు ఏర్పడి మద్దతిచ్చే వరకూ సీరియల్ జనాల్లోకి చొచ్చుకెళ్లింది. వంటలక్క, డాక్టర్ బాబు అంటే తెలుగు జనాల్లో తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో.. అందులో నటించిన వారికి కూడా మంచిపేరు దక్కింది. దీంతో వారికి అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. ఇక వారు ఇతర సీరియళ్లలో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇందులోని పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది.. రోజు రాత్రి ఈ సీరియల్ చూడటానికి మేధావులు సైతం ఆసక్తి చూపించేవారు. ఇందులో కార్తీక్, దీప, సౌందర్య, మోనిత పాత్రలు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. దీంతో సీరియల్ జనరంజకంగా నడిచింది. అయితే వీరి పాత్రలను ఎండ్ చేయడం.. వీరి వారసులను తెరపైకి తేవడంతో మునుపు ఉన్నంత ఊపు ఇప్పుడు ఈ సీరియల్ కు లేకుండా పోయింది.
కార్తీక దీపంలో డాక్టర్ బాబుగా నటించిన నిరుపమ్ పరిటాల ఎంతటి పేరు సంపాదించుకున్నాడో తెలిసిందే. అంతకుముందు ఎన్నో సీరియళ్లలో నటించినా ‘కార్తీక దీపం’తోనే ఆయన ప్రతిభ బయటకొచ్చింది. దీంతో ఆయనకు అవకాశాలు వచ్చినా సమయాభావంతో కుదరలేదు. సినిమా అవకాశాలు సైతం వచ్చినా డేట్స్ సమస్యతో నాడు వదులుకున్నాడు. సీరియల్ నటి మంజులను వివాహం చేసుకుని తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆమె కూడా హిట్లర్ గారి పెళ్లాం సీరియల్ తో తన టాలెంట్ నిరూపించుకుంది. ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ లో కార్తీక్, వంటలక్క పాత్రలను మరణించారని తీసేశారు. దీంతో నిరుపమ్ పాత్ర ముగిసిపోయింది. నిరుపమ్ కు ఇతర సీరియళ్లు కూడా లేకపోవడంతో ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. కార్తీకదీపం అయిపోయాక అదే ధ్యాసలో, మాయలో పడి పిచ్చెక్కిపోయినట్టు అవుతోందని.. సీరియల్స్ లేక ఏం చేయాలో పాలుపోవడం లేదని నిరుపమ్ ఈ మధ్య సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేశాడట.. అందుకే సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నాడు.
Also Read: Anasuya: సిల్క్ శారీలో సూపర్ సెక్సీగా… అందాల దాడి చేసిన అనసూయ!
నిరుపమ్ కార్తీక దీపం సమయంలో బాగానే సంపాదించాడు. రోజుకు రూ.22 వేలు తీసుకుంటూ తన ఆస్తిని పెంచుకున్నాడు. తరువాత మరో రెండు సీరియళ్లలో నటించి భారీగానే ఆర్జించాడు. దాదాపు రోజుకు రూ.60 వేల వరకు సంపాదిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. నెలకు రూ.14 లక్షల వరకూ సంపాదిస్తూ ఆస్తులు పోగేశాడు. వైజాగ్ లో రూ.5 కోట్లు విలువ చేసే ఆస్తులు, హైదరాబాద్ లో రూ.80 లక్షల ప్లాటు సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.
నిరుపమ్ తాను సంపాదించుకున్న ఆస్తితో ప్రస్తుతం చేతిలో సీరియల్స్ ఏవీ లేకపోవడంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులే మిన్న అనే నానుడితో తన సంపాదన పేద వారి కోసం ఖర్చు చేస్తున్నాడు. మురికి వాడల్లో ఉన్న పిల్లల బాగోగులు చూస్తున్నాడు. వారికి కావాల్సిన సహాయం చేస్తూ వారికి దేవుడవుతున్నాడు. ప్రస్తుతం సీరియళ్లకు దూరమై సేవా కార్యక్రమాలకు దగ్గరవుతూ సేవలో తరిస్తున్నాడు. దీంతో నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సంపాద ఎంత ఉన్నా సాయం చేయాలనే గుణమే ప్రధానమని కీర్తిస్తున్నారు.
Also Read:Top 10 Livable Cities : ప్రపంచంలోనే టాప్- 10 నివాసయోగ్య నగరాలేవో తెలుసా?
Recommended Videos