https://oktelugu.com/

Guess Actress: సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ పాప ఎవరో గుర్తుపట్టారా..?

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి సినిమాలో కూడా నటించి అలనాటి మేటి నటి అయిన సావిత్రి గారి పాత్రలో తన హవ భావాలను అనుకరిస్తూ నటించింది.

Written By:
  • Gopi
  • , Updated On : October 17, 2023 / 12:12 PM IST

    Guess Actress

    Follow us on

    Guess Actress: సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు రావాలంటే మంచి సినిమాలు చేస్తూ ముందుకెళ్లాలి.ఈ క్రమంలో కొంతమంది మాత్రం ఇక్కడ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో తమకంటూ మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకుంటారు.ఇక ఇలాంటి వాళ్లలో హీరోయిన్ కీర్తి సురేష్ ఒకరు.ఈమె రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన నేను లోకల్ సినిమాతో తనదైన రీతి లో అందరిని ఆకట్టుకున్నారు.ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా మంది స్టార్ హీరోలతో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

    ఇక అందులో భాగంగానే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి సినిమాలో కూడా నటించి అలనాటి మేటి నటి అయిన సావిత్రి గారి పాత్రలో తన హవ భావాలను అనుకరిస్తూ నటించింది.ఇక ఈ సినిమాకి గాను ఆమెకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఇక ఇప్పుడు ఆమె వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతుంది.ప్రస్తుతం నటనలో తనకు తానే సాటి అని అనిపించుకుంటుంది. ఇప్పటికే ఈ సంవత్సరం తెలుగులో ఆమె రెండు సినిమాలను రిలీజ్ చేసింది.అందులో ఒకటి నాని హీరోగా వచ్చిన దసరా సినిమా కాగా, మరొకటి మెగాస్టార్ చిరంజీవి హీరో గా వచ్చిన భోళా శంకర్ సినిమా… దసర సినిమాలో హీరోయిన్ గా చేయగా, భోళా శంకర్ లో మాత్రం చిరంజీవి చెల్లిగా నటించింది. ఇక ఈ రెండు సినిమాల్లో దసరా సినిమా మంచి విజయాన్ని అందుకోగా, భోళా శంకర్ సినిమా ఆవరేజ్ గా నిలిచింది.కానీ ఈ రెండు సినిమాల్లో ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. నిజానికి కీర్తి సురేష్ తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించడానికి రెడీగా ఉంది.అందులో భాగంగానే ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసింది.

    ఇక ఇవాళ్ళ అంటే అక్టోబర్ 17 కాబట్టి ఈ రోజు కీర్తి సురేష్ బర్త్ డే కావడం వల్ల ఆమెకు సంబంధించిన ఆమె చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. చిన్నప్పుడు కూడా చాలా క్యూట్ లుక్స్ తో ఆమె అందర్నీ ఆకర్షిస్తుంది. ఇక ప్రస్తుతం ఆమె సినిమాలు చేస్తూ చాలా బిజీ గా ఉంటుంది.ఇక తమిళం లో ఇప్పటికే జయం రవి సరసన సైరన్‌ అనే ఒక సినిమాలో నటిస్తోంది.ఈ సినిమా లో తనది చాలా కీలకమైన పాత్ర గా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో తనతో పాటుగా అనుపమ పరమేశ్వరన్, సముద్ర ఖని, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.దీంతో పాటు రివాల్వర్‌ రీటా అనే ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలో కూడా నటిస్తుంది. ఇక వీటితో పాటు రఘుతాత, కన్నెవెడీ అనే తమిళ సినిమాల్లో కూడా నటిస్తుంది.నిజానికి కీర్తి సురేష్ తన నటనతో ప్రేక్షకులందరిని మెప్పిస్తు వస్తుంది.అందుకే ఇన్ని సంవత్సరాలు అయిన తను ఇండస్ట్రీ లో ఇంకా కూడా కొనసాగుతుంది….