Snehithudu Actor : సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ రోబో, ఐ లాంటి సంచలనాత్మక చిత్రాల తర్వాత హిందీ బ్లాక్ బస్టర్ హిట్టైన ‘3 ఇడియట్స్’ ని తమిళ స్టార్ హీరో విజయ్ తో ‘నన్బన్’ గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సినిమాని తెలుగులో ‘స్నేహితుడు’ అనే పేరుతో దబ్ చేసి విడుదల చేసారు. టాక్ బాగానే వచ్చింది కానీ విజయ్ తెలుగు ప్రేక్షకులకు అప్పట్లో పెద్దగా తెలిసిన హీరో కాకపోవడం పెద్ద నంబర్స్ చూడలేకపోయాం. కమర్షియల్ గా కూడా ఈ చిత్రం ఓవరాల్ గా యావరేజ్ రేంజ్ లో నిల్చింది. కానీ టీవీ టెలికాస్ట్ లో మాత్రం మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇప్పటికీ ఈ సినిమా టీవీ లో వేసినప్పుడు మంచి రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటుంది. విజయ్ కాకుండా సూర్య లాంటోళ్ళు ఈ చిత్రాన్ని చేసి ఉంటే పెద్ద హిట్ అయ్యేదని అప్పట్లో ట్రేడ్ పండితులు అనుకునేవారు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో మిల్లీమీటర్ అనే పేరుతో పిలవబడే చైల్డ్ ఆర్టిస్ట్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటాడు. అతను ఇప్పుడు ఎలా తయారయ్యాడో చూస్తే ఆశ్చర్యపోతారు. ఇతని పేరు రిన్సన్ సైమన్. 1995 వ సంవత్సరం ఆగస్టు 4 న చెన్నై లో జన్మించిన ఇతను చిన్నతనం నుండే డ్యాన్స్ లో మంచి నేర్పరి. చిన్నతనం లో ఈయన లిటిల్ మాస్టర్స్, జోడీ నెంబర్ 1 (సీజన్ 5 ) వంటి టీవీ షోస్లలో పాల్గొని అద్భుతమైన డ్యాన్స్ పెరఫార్మన్సెస్ ఇచ్చాడు. ఎలా అయినా ఇండస్ట్రీ లో పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలి అనేది ఇతని ద్యేయం. ఆ కసితోనే ఇండస్ట్రీ లోకి వచ్చి ఆఫర్స్ కోసం ప్రయత్నం చేసాడు. ఆ ప్రయత్నాల్లో ఉండగా ఇతనికి 2008 వ సంవత్సరం ‘కళై’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించే ఛాన్స్ దక్కింది. ఈ సినిమాలో అతను పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ రావడంతో మరి కొన్ని సినిమాల్లో నటించాడు. అలా సాగిపోతున్న ఆయన కెరీర్ కి ‘స్నేహితుడు’ చిత్రం ద్వారా మంచి బ్రేక్ దొరికింది. ఆ సినిమా తర్వాత ఆఫర్స్ క్యూలు కట్టినప్పటికీ ఎందుకో ఆయన వాటిని అంగీకరించలేదు.
కొంతకాలం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఆయన హీరో గా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. మొదటి సినిమానే పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది. ఈయన చివరిసారిగా వెండితెర కి కనిపించిన చిత్రం ధనుష్ నటించిన ‘పాండి’. మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన హీరో గా రాబోతున్న సందర్భంగా రీసెంట్ గా అతను తీసుకున్న ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. చూసేందుకు కుర్రాడు హీరోలాగానే ఉన్నాడు కానీ, టాలెంట్ ఉంటే మాత్రం బుల్లెట్ లాగా ఇండస్ట్రీ లో దూసుకొని వెళ్తాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.