Game Changer Movie- OG Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సుమారుగా మూడేళ్ళ పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం పై అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీ లెవెల్ లో ఉన్నాయి. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా ఈ చిత్రానికి సంబంధించి అన్ని కూడా బంపర్ రెస్పాన్స్ ని దక్కించుకోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా బుకింగ్స్ మొదలు పెట్టినప్పటికీ టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. కేవలం గంటల వ్యవధి లోనే ఈ చిత్రానికి బుకింగ్స్ ద్వారా ఇండియా వైడ్ గా 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంచనా వేస్తున్నారు. గంటల వ్యవధిలో ఇంత అడ్వాన్స్ బుకింగ్స్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు ఇలా ఏ సినిమాకి జరగలేదు.
ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లను సమానంగా అభిమానించే వాళ్లకు ‘గేమ్ చేంజర్’ మొదటి రోజు థియేట్రికల్ అనుభూతి అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న చిత్రం ‘ఓజీ’. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ గ్లిమ్స్ వీడియో ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు, అభిమానులు థియేటర్స్ లో చూడాలని చాలా కోరుకున్నారు. కానీ సెన్సార్ చేయకపోవడం వల్ల థియేటర్స్ లో ఈ గ్లిమ్స్ వీడియో ని ప్రదర్శించలేకపోయారు. ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ సమాచారం ఏమిటంటే, ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ఈ గ్లిమ్స్ వీడియో ని అటాచ్ చేయబోతున్నారని తెలుస్తుంది.
కేవలం ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ఒక్కటే కాదు, సంక్రాంతికి విడుదల అవుతున్న అన్ని సినిమాలకు కూడా ఈ గ్లిమ్స్ వీడియో ని జత చేస్తున్నారట. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే. కేవలం ఓజీ పేరు పైకి తీస్తేనే పూనకాలొచ్చి ఊగిపోతున్న అభిమానులు, ఇక సిల్వర్ స్క్రీన్ మీద ఆ గ్లిమ్స్ వీడియో ని చూస్తే ఏమైపోతారో అని సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు కేవలం ఈ గ్లిమ్స్ వీడియో ని చూసేందుకు అయినా సంక్రాంతి సినిమాలకు వెళ్తారు. రేపు ‘గేమ్ చేంజర్’ థియేటర్స్ లో విరామం సమయంలో ఈ టీజర్ ని ప్రదర్శించినప్పుడు వచ్చే రెస్పాన్స్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా అంతటా హల్చల్ చేస్తాయి. చూడాలి మరి ఏ రేంజ్ రెస్పాన్స్ ని ఈ గ్లిమ్స్ వీడియో అందుకోబోతుంది అనేది. దీనితో పాటు ‘హరి హర వీరమల్లు’ టీజర్ ని కూడా థియేటర్స్ కి జత చేసుంటే బాగుండేది అని అభిమానులు అనుకుంటున్నారు.