Race Gurram Child Artist: ‘రేసుగుర్రం’ చిత్రంలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఎంత పెద్ద హీరో అయ్యాడో చూడండి!

కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరిన చివరి తెలుగు సినిమా ఇదే. అయితే ఈ చిత్రం లో ఏం ఎస్ నారాయణ పాత్ర మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఒక చిన్న టీ కొట్టు నడుపుకునే సాధారణమైన వ్యక్తిగా ఆయన ఈ చిత్రం లో కనిపిస్తాడు.

Written By: Neelambaram, Updated On : August 15, 2024 5:04 pm

Race Gurram Child Artist

Follow us on

Race Gurram Child Artist: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ది బెస్ట్ కమర్షియల్ సినిమా ఏదైనా ఉందా అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు ‘రేసు గుర్రం’. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి సుమారుగా 55 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంది. ఆరోజుల్లో స్టార్ హీరోలకు ‘మగధీర’, ‘గబ్బర్ సింగ్’ చిత్రాల రికార్డ్స్ ని కొట్టడం చాలా కష్టంగా ఉండేది. అలాంటిది ‘రేసు గుర్రం’ చిత్రం గబ్బర్ సింగ్ చిత్రానికి చాలా దగ్గరగా అనేక ప్రాంతాలలో వెళ్ళింది. ఈ సినిమా తర్వాతనే అల్లు అర్జున్ కి యూత్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అంతకు ముందు కూడా ఆయనకీ ఫ్యాన్స్ బాగానే ఉండేవారు కానీ, స్టార్ అనిపించుకునే రేంజ్ మాత్రం కాదు.

ఆ స్థాయి వచ్చింది ఈ సినిమా తర్వాతనే. అంతే కాదు గడిచిన పది సంవత్సరాలలో ఇలాంటి కమర్షియల్ చిత్రం కూడా మన టాలీవుడ్ లో రాలేదు. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరిన చివరి తెలుగు సినిమా ఇదే. అయితే ఈ చిత్రం లో ఏం ఎస్ నారాయణ పాత్ర మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఒక చిన్న టీ కొట్టు నడుపుకునే సాధారణమైన వ్యక్తిగా ఆయన ఈ చిత్రం లో కనిపిస్తాడు. అల్లు అర్జున్ వారిని సొంత మనుషులుగా భావిస్తాడు. ఒకరోజు ఏం ఎస్ నారాయణ కొడుక్కి కారు యాక్సిడెంట్ జరిగితే, అల్లు అర్జున్ ఆ అబ్బాయి ప్రాణాలను కాపాడేందుకు తాను అమెరికా కి వెళ్లేందుకు దాచుకున్న వీసా డబ్బులని ఇచ్చి చికిత్స చేయించి ఆ అబ్బాయి ప్రాణాలను కాపాడుతాడు. ఆ సన్నివేశం లో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు సాత్విక్ వర్మ. ఈ కుర్రాడు ఈ చిత్రం తర్వాత అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసాడు కానీ, అనుకున్న స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. కానీ పెద్దయ్యాక ఈ కుర్రాడు హీరో గా మన ముందుకు వచ్చాడు. 2022 వ సంవత్సరం లో ఈయన ‘బ్యాచ్’ అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Race Gurram Child Artist

ఆ సినిమా కమర్షియల్ గా అంతగా ఆడలేదు. విడుదలకు ముందు ప్రొమోషన్స్ బాగానే చేసాడు కానీ, ఎందుకో ఆ చిత్రం జనాల్లోకి వెళ్లలేకపోయింది. ఆ తర్వాత ఒక ఏడాది గ్యాప్ తీసుకొని, ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ లోకి ‘చిస్లేట్’ అనే చిత్రం ద్వారా అడుగుపెట్టాడు. ఫిబ్రవరి 2 వ తారీఖున తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. దీంతో ఈ కుర్ర హీరో కెరీర్ ఇప్పుడు డైలమా లో పడింది. చూసేందుకు ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న సాత్విక్ మంచి స్క్రిప్ట్స్ ఎంచుకుంటే కచ్చితంగా సక్సెస్ సాధించగలడు . మరి ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.