Actresses maintenance cost: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవాళ్లకు మాత్రమే గొప్ప పేరైతే వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక్క సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఈ క్రమంలోనే హీరోలతో పాటు హీరోయిన్లు కూడా సక్సెస్ ల వెనకాల పరిగెడుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోజుకు ఒక హీరోయిన్ వచ్చి తమ టాలెంట్ తో తమ అందచందాలను ఆరబోస్తూ పేరు సంపాదించుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలో కూడా కొంతమంది హీరోయిన్లు 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూనే ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా వాళ్ల మనుగడను కొనసాగిస్తున్నారు అంటే మామూలు విషయం కాదు. ఇక ఇలాంటి క్రమంలోనే హీరోయిన్ల మెయింటెనెన్స్ కోసం భారీగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి హీరోయిన్ల మెయింటెనెన్స్ కోసం అంతలా ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుందంటే వాళ్లు దీన్ని మైంటైన్ చేయాల్సి ఉంటుంది. వాళ్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని చూసుకోవడానికి వాళ్ళకి ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉంటాడు.
ఒక మేకప్ మ్యాన్, కాస్ట్యూమ్ డిజైనర్, వాళ్ల హెల్త్ చూసుకోవడానికి డాక్టర్లు ఇలా వీటన్నింటిమీద హీరోయిన్ మెయింటెనెన్స్ కోసం విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అయితే వాళ్లు కొంచెం నిర్లక్ష్యం వహించి తమ అందచందాల్లో గాని తమ రూపురేఖల్లో గాని చిన్న మార్పులు వచ్చినా కూడా అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఉంది.
కాబట్టే వాళ్ళు అందాన్ని చాలా బాగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ ఖర్చులన్నింటిని భరించాలంటే నెలకు లక్షల్లో ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని భరించడానికి హీరోయిన్లు ఎక్కువ రెమ్యూనరేషన్స్ ను ఛార్జ్ చేస్తూ తమ కెరియర్ ని కొనసాగిస్తున్నారు.
కొంతమంది హీరోయిన్స్ కి అంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఎందుకని చాలామంది అడుగుతూ ఉంటారు. నిజానికి వాళ్ళ మెయింటెనెన్స్ కోసం విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారనే విషయం కూడా బయట జనాలకు తెలుస్తుంది. అందువల్ల వాళ్ళకి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చిన పర్లేదు అని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు…