Surya – Jyotika : సినీ ఇండస్ట్రీలో కలిసి మెలిసి నటించిన వాళ్లు ఆ తరువాత రియల్ లైఫ్ లో ఒక్కటైన వారు చాలా మందే ఉన్నారు. కానీ కొంత మంది మాత్రమే జీవితాంతం కలిసున్నారు. భార్యభర్తల మధ్య తగుగువులు కామన్. కానీ సినీ ఇండస్ట్రీకి చెందిన వారిలో ఎక్కువ. దీంతో చాలా మంది ఎక్కువ రోజులు కలిసి ఉండలేరు. కానీ సూర్య, జ్యోతికలు మాత్రం అన్యోన్య దంపతులుగా పేర్కొంటారు. విడివిడిగా వీరు సినిమాల్లోకి వచ్చి ఎవరికి వారే స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆ తరువాత ఓ సినిమాలో నటించి ఒక్కటయ్యారు. అయితే సూర్య, జ్యోతికల ప్రేమ ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది? అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సూర్య సినీ బ్యాగ్రౌండ్ ఉన్న నటుడే. ఆయన తండ్రి శివకుమార్ అండతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. 1975 జూలై 23న జన్మించారు. చెన్నైలోని సెయింట్ బేడేస్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివాడు. చదువు పూర్తయిన తరువాత సూర్య కూడా సినిమాల్లోకి రావాలని అనుకున్నాడు.ఈ క్రమంలో మణిరత్నం నిర్మించిన నెరుక్కు నెర్ అనే సినిమాలో నటించారు. అయితే ఆ తరువాత ‘నందా’ అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
2005లో మురుగుదాస్ తీసిన ‘గజిని’ సినిమాతో సూర్య తెలుగుకు కూడా పరిచయం అయ్యారు. ఆ తరువాత తెలుగులో నేరుగా ‘రక్త చరిత్ర’ సినిమాలో నటించి ఇక్కడి ఫ్యాన్స్ ను పెంచుకున్నాడు. అయితే సూర్య ‘యముడు’ చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి ప్రయోగాత్మక చిత్రాలు తీస్తూ అలరిస్తున్నాడు. సూర్య నటించిన ఏ సినిమా అయినా ఇప్పుుడు తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది.
2003లో గౌతమ్ మీనన్ డైరెక్షన్లో ‘కాకా కాకా’ అనే సినిమా థియేటర్లోకి వచ్చింది. దీనిని తెలుగులో ఘర్షణ తో రీమేక్ చేశారు. ఇందులో వెంకటేశ్ నటంచారు. ఈ సినిమాలో హీరోయిన్ గా జ్యోతిక నటించింది. ఈ సమయంలోనే సూర్య, జ్యోతికల ప్రేమ స్టార్ట్ అయింది. ఆ తరువాత వీరు పెద్దలను ఒప్పించి 2006 సెప్టెంబర్ 11న వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జ్యోతిక పెళ్లయిన తరువాత కూడా సినిమాలు చేస్తోంది. అయితే గ్లామర్ జోలికి మాత్రం పోవడం లేదు. అటు సూర్య నిర్మాతగానూ ‘జై భీమ్’ తీసిన విషయం తెలిసిందే.