https://oktelugu.com/

Nandamuri – Nara Successors Movie : నందమూరి-నారా వారసులు ఒకే చిత్రంతో ఎంట్రీ… డబల్ ధమాకా! 

నందమూరి నట వారసుడు ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాలో మరో పెద్ద ఫ్యామిలీ కి చెందిన వారసుడు ఎంట్రీ కూడా ఖాయం అనే మాటలు వినిపిస్తుంది. అతను ఎవరో కాదు నారా- నందమూరి ఫ్యామిలీ లా ముద్దుబిడ్డ నారా దేవాన్ష్.

Written By:
  • Shiva
  • , Updated On : July 23, 2023 / 12:10 PM IST
    Follow us on

    Nandamuri – Nara Successors Movie  : టాలీవుడ్ లో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణం. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఆయన ఫ్యాన్స్ తో పాటుగా టాలీవుడ్ జనాలు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపులకు త్వరలోనే ఎండ్ కార్డు పడనుంది. దీనిపై బాలకృష్ణ క్లారిటీ ఇస్తూ, ఎన్నికల తర్వాత  మోక్షజ్ఞ  సినిమా ఉంటుంది అనే విషయాన్ని వెల్లడించాడు. అదే సమయంలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది.

    నందమూరి నట వారసుడు ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాలో మరో పెద్ద ఫ్యామిలీ కి చెందిన వారసుడు ఎంట్రీ కూడా ఖాయం అనే మాటలు వినిపిస్తుంది. అతను ఎవరో కాదు నారా- నందమూరి ఫ్యామిలీ లా ముద్దుబిడ్డ నారా దేవాన్ష్. మీరు విన్నది నిజమే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తున్నది.

    ఈ సినిమా కోసం యూత్ అండ్ పవర్ఫుల్ స్టోరీని లాక్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా లో మోక్షజ్ఞ సరసన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల ను ఖాయం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో మోక్షజ్ఞ చిన్నప్పటి క్యారెక్టర్ కోసం నారా దేవాన్ష్ అయితే సినిమాకు క్రేజ్ రావడం తో పాటుగా మామ అల్లుడు ఎంట్రీ కూడా ఒకే సినిమా తో జరిగినట్లు ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.


    ఇప్పటికే బాలయ్య చిన్న కూతురు కొడుకు ను బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా వెండితెరకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పెద్ద కూతురు కొడుకును తన కొడుకు సినిమా ద్వారా  వెండితెరకు పరిచయం  చేయాలనీ బాలకృష్ణ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి నారా బ్రాహ్మణి కి సినిమాల విషయంలో అంత ఆసక్తి లేదని తెలుస్తుంది. కాకపోతే తమ్ముడు సినిమా కావటంతో ఫ్యామిలీ మాటను గౌరవిస్తూ ఈ సినిమాకు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది చివరి నాటికి నారా- నందమూరి నట వారసులను ఒకే సినిమా లో చూసే అవకాశం ఫ్యాన్స్ కి రాబోతుంది.

    ఇప్పటికే నందమూరి మోక్షజ్ఞ సినిమా కోసం స్లిమ్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే, 28 ఏళ్ల మోక్షజ్ఞ  సినీ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సింది, కాకపోతే కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే, ఎన్టీఆర్, రాంచరణ్ , అల్లు అర్జున్ లాంటి వాళ్ళు 28 ఏళ్లకే స్టార్ హీరోల రేంజ్ కి ఎదిగారు. మోక్షజ్ఞ  మాత్రం ఇప్పుడే తన కెరీర్ ని స్టార్ట్ చేయటం విశేషం.