https://oktelugu.com/

Aha OTT : ఓటీటీల్లో అగ్రెసివ్ గా ‘ఆహా’ బ్లాక్ బస్టర్స్ బేబీ, సామజవరగమనతో ప్రత్యర్థులకు టఫ్ ఫైట్ 

సామజవరగమన హక్కులను ఆహా సొంతం చేసుకుంది. జులై 28 నుండి ఇది స్ట్రీమ్ కానుంది. శ్రీవిష్ణు హీరోగా నరేష్ కీలక రోల్ లో తెరకెక్కిన సామజవరగమన మంచి విజయాన్ని అందుకుంది.

Written By:
  • Shiva
  • , Updated On : July 23, 2023 / 12:37 PM IST
    Follow us on

    Aha OTT : చిన్న సినిమాలుగా విడుదలై భారీ విజయాలు సాధించాయి సామజవరగమన, బేబీ. ఈ రెండు సెన్సేషనల్ మూవీస్ ఒకే ఓటీటీలో స్ట్రీమ్ కానున్నాయి. సామజవరగమన స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. బేబీ కూడా అదే ఫ్లాట్ ఫార్మ్ లో స్ట్రీమ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే తెలుగు ఓటీటీ యాప్ ఆహా. నిర్మాత అల్లు అరవింద్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా స్థాపించిన విషయం తెలిసిందే. భవిష్యత్ ఓటీటీలదే అని నమ్మిన అల్లు అరవింద్… డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో అడుగుపెట్టారు. 
     
    అయితే మార్కెట్ లీడర్స్ హాట్ స్టార్స్, అమెజాన్, జీ 5, నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలను తట్టుకొని నిలబడటం అంత సులభం కాదు. సినిమాలు, సిరీస్లు, రియాలిటీ షోలు, కామెడీ షోలు, టాక్ షోలతో ఆహా ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మిగతా ఓటీటీ సంస్థలతో పోల్చితే సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ చాలా తక్కువ. అయినా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఆహా నష్టాల్లో నడుస్తుండగా ఇటీవల నాయకత్వ మార్పు కూడా జరిగింది. గతంలో సీఈఓగా ఉన్న అజిత్ ఠాకూర్ ని బోర్డు ఆఫ్ డైరెక్టర్ గా ప్రమోట్ చేశారు. 
     
    సీఈఓ బాధ్యతలు రవికాంత్ సబ్నవిస్ కి అప్పగించారు. కాగా లేటెస్ట్ టాలీవుడ్ సె న్సేషన్స్ సామజవరగమన, బేబీ చిత్రాలు ఆహాకు భారీగా సబ్స్క్రైబర్స్ తెచ్చిపెడతాయని భావిస్తున్నారు. చిన్న చిత్రాలు దాదాపు ఆహాలో స్ట్రీమ్ అవుతున్నాయి. సామజవరగమన హక్కులను ఆహా సొంతం చేసుకుంది. జులై 28 నుండి ఇది స్ట్రీమ్ కానుంది. శ్రీవిష్ణు హీరోగా నరేష్ కీలక రోల్ లో తెరకెక్కిన సామజవరగమన మంచి విజయాన్ని అందుకుంది. ఈ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను మెప్పించింది. 
     
    సామజవరగమన ఓటీటీలో మరింత ఆదరణ దక్కించుకునే అవకాశం కలదు. అలాగే బేబీ మూవీ సైతం ఆహా సొంతం కానుంది. బేబీ చిత్రాన్ని అల్లు అరవింద్, అల్లు అర్జున్ దగ్గరుండి ప్రమోట్ చేశారు. ఆనంద్ దేవరకొండ అన్నయ్యగా విజయ్ దేవరకొండ కూడా ప్రచారం కల్పించారు. ఇక బేబీ నిర్మాత ఎస్కేఎన్ అల్లు అర్జున్ పిఆర్పీవో. చెప్పాలంటే ఆయన భక్తుడు. అల్లు అర్జున్ మద్దతుతో ఎదిగిన వ్యక్తి. మరి ఆహాను కాదని ఎస్కేఎన్ మరొకరికి బేబీ చిత్రాన్ని ఇస్తారనుకోవడం పొరపాటే. కాబట్టి బేబీ ఆహాలో స్ట్రీమ్ కానుందనేది ఖాయం. సామజవరగమన, బేబీ ఎంట్రీతో ఆహాకు పెద్ద ఎత్తున మేలు జరిగే సూచనలు కలవు. ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య-విరాజ్ ప్రధాన పాత్రలు చేయగా దర్శకు సాయి రాజేష్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కించారు. సామజవరగమన, బేబీ చిత్రాలు కొత్త సబ్స్క్రైబర్స్ ని తెచ్చిపెడతాయని ఆహా భావిస్తుంది. దిగ్గజ ఓటీటీలకు మించి ఆహా గేమ్ చేంజర్ గా మంచి సినిమాలతో మంచి కంటెంట్ తో దూసుకెళుతోంది. తెలుగు ఓటీటీ ఈ జాతీయ ఓటీటీలను మించి రాణించాలని కోరుకుందాం..