Rajamouli Eega Movie: దర్శక ధీరుడ రాజమౌళి సినిమా వస్తుందంటేనే ఇండియన్ బాక్సాఫీస్ ఊగిపోతుంది. కొత్త రికార్డులకు లెక్కలు సరిచేసుకునే పరిస్థితి. ఆ కథ ఎలా ఉంటుందో.. ఆ మేకింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో అని సినీ లోకమంతా వేయికండ్లతో ఎదురు చూస్తుంది. అదీ రాజమౌళి ట్యాలెంట్ అంటే. తీసిన ప్రతి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూనే ఉన్నారు.
తన ప్రతిసినిమా రికార్డును తిరగరాయాలంటే మళ్లీ ఆయన సినిమాతోనే సాధ్యం. అంతలా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయన గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఓ విషయం బాగా చర్చనీయాంశం అవుతోంది. రాజమౌళి రామ్ చరణ్ హీరోగా, కాజల్ హీరోయిన్‌గా చేసిన మూవీ మగధీర.
Also Read: Megastar Chiranjeevi: చిరు అరుదైన రికార్డు.. ఐదుగురు అక్కాచెల్లెళ్లతో ఆడిపాడిన ఏకైక హీరో..!
2009లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కాగా తెలుగుతో పాటు తమిల, మళయాల భాషల్లో కూడా ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడంట జక్కన్న. ఇక సినిమాకు ప్రొడ్యూసర్ గా చేసిన అల్లు అరవింద్ కు ముందే కొన్ని కండీషన్లు కూడా పెట్టాడంట. సినిమా రిలీజ్ అయ్యాక 50 రోజులు, 100 రోజులు సెంటర్ల డీటేయిల్స్ అస్సలు బయటకు చెప్పొద్దని కండీషన్ పెట్టాడు.
అసలు జక్కన్న తన తొలి పాన్ ఇండియా సినిమాగా దీన్ని రిలీజ్ చేయాలని అనుకున్నారంట. కానీ అరవింద్ మాత్రం దీన్ని తమిళ, మళయాల భాషల్లో రిలీజ్ చేయలేదు. ప్లాన్ లేదని వెనకడుగు వేశారంట. పైగా తెలుగులో ఆడుతున్న సమయంలోనే ఇతర భాషల ప్రజలు దీన్ని చూడటంతో బజ్ పోయిందంట. దాంతో రాజమౌళి తీవ్ర నిరాశ చెందినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇంత మంచి సినిమాను అన్ని భాషల్లో రిలీజ్ చేస్తే మంచి గుర్తింపు వచ్చేదని జక్కన్న ఆశపడ్డారంట. ఇక సినిమా కలెక్షన్ల వివరాలను కూడా చెప్పారు అరవింద్. అలాగే సినిమా ప్రమోషన్లలో జక్కన్నకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదంట అరవింద్. దీంతో అరవింద్‌పై రాజమౌళి కోపం పెంచుకుని హీరో లేకుండానే సినిమా తీయాలని భావించారు.
అలా ఛాలెంజింగ్ చేసి రాజమౌళి ఈగ సినిమాను తీశాడన్న గుసగుసలు అప్పట్లో బాగానే వినిపించాయి. ఇక ఈ మూవీ సరికొత్త రికార్డులు సృష్టించింది. కేవలం ఈగతోనే విలన్‌ను చంపించిన విధానం అందరినీ బాగా ఆకట్టుకుంది. అలా జక్కన్న తన ట్యాలెంట్‌ను నిరూపించుకున్నారన్నమాట.
Also Read:Mahesh Babu Emotional Post: ఎప్పటికీ ప్రేమిస్తాను.. కన్నీళ్లు పెట్టుకున్న మహేష్ !
Recommended Videos