https://oktelugu.com/

Megastar Chiranjeevi: చిరు అరుదైన రికార్డు.. ఐదుగురు అక్కాచెల్లెళ్ల‌తో ఆడిపాడిన ఏకైక హీరో..!

Megastar Chiranjeevi: ఇప్పుడంటే స్టార్ హీరోలు ఏడాదిక ఒక సినిమా చేస్తేనే ఎక్కువ‌. కానీ 1990వ ద‌శ‌కంలో మాత్రం చిరంజీవి, కృష్ణ లాంటి స్టార్ హీరోలు ఒకే ఏడాది ప‌దుల సంఖ్య‌లో సినిమాలు చేసేవారు. అందులో చాలా వ‌ర‌కు హిట్టు అయ్యాయి కూడా. అప్ప‌ట్లో చిరంజీవి మెగాస్టార్‌గా ఫుల్ ఫామ్ లో వ‌రుస‌బెట్టి సినిమాలు చేశారు. కాగా ఇండ‌స్ట్రీలో ఎన్నో రికార్డులు ఇప్ప‌టికీ ఆయ‌న పేరు మీద‌నే ఉన్నాయి. వాటిని కొట్ట‌డం కూడా క‌ష్ట‌మే. అలాంటి ఓ […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 21, 2022 / 09:03 AM IST
    Follow us on

    Megastar Chiranjeevi: ఇప్పుడంటే స్టార్ హీరోలు ఏడాదిక ఒక సినిమా చేస్తేనే ఎక్కువ‌. కానీ 1990వ ద‌శ‌కంలో మాత్రం చిరంజీవి, కృష్ణ లాంటి స్టార్ హీరోలు ఒకే ఏడాది ప‌దుల సంఖ్య‌లో సినిమాలు చేసేవారు. అందులో చాలా వ‌ర‌కు హిట్టు అయ్యాయి కూడా. అప్ప‌ట్లో చిరంజీవి మెగాస్టార్‌గా ఫుల్ ఫామ్ లో వ‌రుస‌బెట్టి సినిమాలు చేశారు. కాగా ఇండ‌స్ట్రీలో ఎన్నో రికార్డులు ఇప్ప‌టికీ ఆయ‌న పేరు మీద‌నే ఉన్నాయి. వాటిని కొట్ట‌డం కూడా క‌ష్ట‌మే. అలాంటి ఓ అరుదైన రికార్డు గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

    Megastar Chiranjeevi, radhika

    చిరు ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన 152 సినిమాల్లో చాలామంది హీరోయిన్ల‌తో చేశాడు. కాగా ఇందులో ఒక‌ప్ప‌టి త‌రం రాధిక‌, మేన‌క‌ల నుంచి నేటి యంగ్ జ‌న‌రేష‌న్ కాజ‌ల్ లాంటి వారితో కూడా స్టెప్పులేశాడు. అయితే ఇందులో ఓ ఐదుగురు అక్కాచెల్లెళ్ల‌తో చిరు న‌టించాడు. ఆ రికార్డు కేవ‌లం ఆయ‌న‌కే ద‌క్కింది. ఇందులో చూసుకుంటే.. రాధిక, ఆమె చెల్లెలు నిరోష‌తో చిరు న‌టించారు.

    Also Read: Anjali: ప్చ్.. వచ్చినట్టే వచ్చి మిస్ అయింది !

    Megastar Chiranjeevi, nirosha

    రాధిక‌తో చూసుకుంటే 1980వ ద‌శ‌కంలో చాలా సినిమాలు వ‌చ్చాయి. అందులో న్యాయం కావాలి, అభిలాష, గూఢ‌చారి నెంబ‌ర్ 1, రాజా విక్ర‌మార్క లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు వారి ఖాతాలో ఉన్నాయి. ఇక రాధిక చెల్లెలు నిరోష‌తో క‌లిసి స్టూవ‌ర్ట్‌పురం పోలీస్‌స్టేష‌న్‌, మూవీలో న‌టించారు. ఇక మ‌రో ముగ్గురు అక్కా చెళ్లెల్లు అయిన నగ్మా, రోషిణి, జ్యోతిక‌తో క‌లిసి న‌టించారు.

     

    Nagma, Jyothika, Roshini

    ఇందులో రోషిణి, జ్యోతిక‌కు ఒక తండ్రికి పుట్ట‌గా.. న‌గ్మా మ‌రో తండ్రికి పుట్టింది. కానీ వీరంద‌రికీ త‌ల్లి ఒక్క‌రే కావ‌డం విశేషం. అయినా స‌రే ముగ్గురూ ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. న‌గ్మాతో క‌లిసి చిరు ఘ‌రానా మొగుడు, రిక్షావోడు మూవీలు చేశారు. జ్యోతిక‌తో క‌టిసి ఠాగూర్ సినిమా చేశారు. ఇక రోషిణితో క‌లిసి మాస్ట‌ర్ మూవీని చేశారు. ఇవ‌న్నీ కూడా ఇండ‌స్ట్రీ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలే. ఇలా ముగ్గురు, ఇద్ద‌రు చొప్పున మొత్తం ఐదుగురు అక్కా చెళ్లెల్ల‌తో న‌టించిన ఏకైకా హీరోగా చిరు రికార్డు కొట్టేశార‌న్న‌మాట‌.

    Also Read:Ram Gopal Varma Maa Ishtam Movie: హేయ్.. వివాదాస్పద వర్మ షాక్ ఇచ్చాడుగా !
    Recommended Videos

    Tags