Samosa Rate In Delhi Airport: మన ఇండియాలో చాలా స్నాక్స్‌ను ఇష్టంగా తింటుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆహార పదార్థాన్ని స్నాక్స్ గా తీసుకుంటారు. మన తెలంగాణ లాంటి ప్రాంతంలో బజ్జీలు, మిర్చీలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అదే నార్త్ స్టేట్స్ లలో మాత్రం ఎక్కువగా సమోసాలు కనిపిస్తాయి. అక్కడ సాయంత్రం వేళల్లో ఎక్కువగా వీటిని తింటుంటారు జనాలు.
అయితే మన దేశంలో ఒకరకమైన మోసం ఎప్పటి నుంచో ఉంది. అదేంటంటే ధన వంతులు ఒక వస్తువు ధరను ఎంతైనా కొనగలుగుతారు. అది వారికి పెద్ద భారం కాదు. అదే పేదవాళ్లు, మధ్య తరగతి వారు ఒక వస్తువు ధర పెరిగితే కొనడం కష్టం. కానీ వ్యాపారులు మల్టీప్లెక్సుల్లాంటి ఏరియాల్లో వాటి ధరను పెంచేయడంతో.. బయట కూడా అదే ధరకు అమ్ముతున్నారు చాలామంది.
Also Read: Rajamouli Eega Movie: ఆయన మీద కోపంతోనే జక్కన్న ఈగ మూవీని తీశాడంట..!
మనకు తెలిసినంత వరకు సమోసాలు ఎంత ఉంటాయి… మహా అయితే రూ.10 నుంచి రూ.20వరకు ఉంటాయి. అంతే కదా. కానీ ఒక్కో సమోసా రేటు రూ.170కి అమ్మితే ఎలా ఉంటుంది.. వినడానికే షాకింగ్ గా ఉంది కదూ.. కానీ ఇది నిజంగా మన ఇండియాలోనే జరిగింది. వివరాళ్లోకి వెల్తే.. ప్రియాల్ అనే వ్యక్తి ట్విట్టర్ అకౌంట్ లో ఈ సమోసాల ఫొటోలను షేర్ చేశారు.
వీటిని ఢిల్లీ ఎయిర్ పోర్టులోని కోస్టా ఈటరీలో అమ్ముతున్నారంట. ఆయన అక్కడే కొన్నట్టు తెలిపారు. వీటికి ఆస్ట్రియా స్నాక్ డిజైన్ ఇచ్చి రూ.170కి అమ్ముతున్నట్టు తెలిపాడు. మన ఇండియన్ సమోసాకు డిజైన్ మార్చి ఇంత భారీ రేటుకు అమ్ముతున్నట్టు ఆయన చెప్పుకొచ్చాడు. కాగా దీనిపై చాలామంది కామెంట్లు పెడుతున్నారు.
ఇండియన్ రూపాయికి డాలర్ రూపం ఇవ్వడం అంటే ఇదే అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ఇంత భారీ ధరకు అమ్ముతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటూ మండిపడుతున్నారు చాలామంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మండిపోతున్నాయని.. ఇలాంటి స్నాక్స్ ధరలు కూడా పెంచుతూ పోతే.. ఇంకెలా బతకాలంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు.
Also Read:Hyderabad: పాతబస్తీలో శృతిమించుతున్న ఆగడాలు.. కరెంట్ కట్ చేసినందుకు సబ్ ఇంజినీర్ చాతీపై తన్నాడు..!
Recommended Videos: