https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను ప్రొడ్యూసర్స్ హీరో అని ఎందుకంటారో తెలుసా..?

ఇదిలా ఉంటే ఫాన్స్ లోనే కాకుండా ఇండస్ట్రీలో కూడా ఆయన అంటే అందరికి చాలా మంచి అభిమానం ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయనని ప్రొడ్యూసర్స్ హీరో అని కూడా అంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : March 14, 2024 / 12:15 PM IST

    Pawan Kalyan as producers hero

    Follow us on

    Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న స్టార్ డమ్ ని మ్యాచ్ చేసే హీరో మరొక్కరు లేరు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఆయన చూపించిన నటన కానీ, ఆయన సంపాదించుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గాని చాలా గొప్పగా ఉన్నాయనే చెప్పాలి.

    ఇక ఇదిలా ఉంటే ఫాన్స్ లోనే కాకుండా ఇండస్ట్రీలో కూడా ఆయన అంటే అందరికి చాలా మంచి అభిమానం ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయనని ప్రొడ్యూసర్స్ హీరో అని కూడా అంటారు. ఎందుకంటే ఒకవేళ ప్రొడ్యూసర్స్ కి ఏదైనా నష్టం జరిగిన ఆయన తన రెమ్యూనరేషన్ ను కూడా వెనక్కి తిరిగి ఇచ్చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అందువల్లే ఆయన్ని ప్రొడ్యూసర్స్ హీరో అని కూడా అంటారు. జానీ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత తన రెమ్యూనరేషన్ ని ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ కి తిరిగి ఇచ్చేశాడు.

    అలాగే అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ కి ముందే లీక్ అవ్వడం వల్ల ఆ ప్రొడ్యూసర్స్ కి నష్టం వస్తుందేమో అని చెప్పి తన రెమ్యూనరేషన్ పూర్తిగా తిరిగి ప్రొడ్యూసర్ కి ఇచ్చేశాడు. సక్సెస్ అయితే దాంట్లో నుంచి ఎంతో కొంత ఇవ్వమని ప్రొడ్యూసర్ కి చెప్పాడట…పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే ప్రొడ్యూసర్ ఒక సెక్యూర్ జోన్ లో ఉంటాడనే చెప్పాలి. ఇప్పుడు ఆయన పాలిటిక్స్ వల్ల కొంచెం బిజీగా ఉండి సినిమాల మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కానీ ఆయన కాన్సెంట్రేట్ చేసి సినిమా చేస్తే మాత్రం వరుస సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ ఈజీగా కొడుతాడు అని అతని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలు రాజకీయాలంటూ ముందుకు కదులుతున్నాడు. ఇక ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ సినిమా షూటింగ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు…