Why Naga Vamsi likes NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. విశ్వవిఖ్యాత ‘శ్రీ నందమూరి తారక రామారావు’ గారు చేసిన సినిమాలు అప్పట్లో పెను సంచలనాలను క్రియేట్ చేశాయి. ఇక ఆయన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు సైతం భారీ విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికి కూడా ఆయన మంచి మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…ఇక ఈ ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) సైతం ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పటికీ పాన్ ఇండియాలో స్టార్ హీరోగా రాణిస్తున్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. ప్రస్తుతం వార్ 2 (War 2) సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక దీంతో పాటుగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో డ్రాగన్ (Dragon) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తో ఒక మంచి విజయాన్ని సాధిస్తానని, ఇండియాలో ఉన్న అన్ని రికార్డులను కొల్లగొట్టాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన ఎన్ని విజయాలు సాధించినా కూడా ఇకమీదట సాధించబోయే విజయాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకురాబోతున్నాయి. ఎందుకంటే ఆయన విజయాలు అతన్ని చాలా ఉన్నతమైన స్థానంలో నిలిపాయి. కాబట్టి దాన్ని కాపాడుకోవాలంటే అంతకు మించిన మంచి సినిమాలు చేస్తూ ఉండాలి. ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న నాగ వంశీ సైతం తారక్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు.
ఎన్టీఆర్ ని అన్నా అంటానని ఆయనతో సినిమాలు చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తానని చెప్పాడు. అలాగే ఇప్పుడున్న హీరోలు అందరితో మంచి అనుబంధం ఉన్నప్పటికి తనకు ఎన్టీఆర్ తో మాత్రమే చాలా మంచి బాండింగ్ ఉంటుందని, ఎన్టీఆర్ అన్నకి కూడా నాతో స్పెషల్ బాండింగ్ ఉంటుందని చెప్పాడు.
Also Read: మహేష్ బాబు కి బాగా నచ్చిన యాంకర్ ఎవరో తెలుసా…?
మరి వీళ్ళిద్దరి మధ్య అంత మంచి బాండింగ్ కుదరడానికి గల కారణం ఏంటి అంటే ఇద్దరు సినిమాల గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారట. సినిమా వల్లే వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ కుదిరిందని చెప్పడం విశేషం…
మరి ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ఒక మైథాలజికల్ సినిమాకి నాగవంశీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా ని సెట్స్ మీదకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…