Vadde Naveen
Vadde Naveen: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే శ్రీకాంత్, జగపతిబాబు లాంటి నటులు కూడా వీళ్లకు సపోర్టుగా సినిమాలు చేస్తూ మంచి పేరు అయితే సంపాదించుకున్నారు. ఎక్కువగా వీళ్ళు ఫ్యామిలీ సినిమాలను చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరవ్వడమే కాకుండా చిన్న సినిమాలను కూడా ఎక్కువగా చేసి చిన్న ప్రొడ్యూసర్లను ఆదుకున్నారనే చెప్పాలి.
ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళతోపాటు వడ్డే నవీన్ కూడా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఆయన స్టార్ హీరోగా మంచి స్టేటస్ ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత సక్సెస్ లను మాత్రం ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. ఆయన కెరియర్లో పెళ్లి , చాలా బాగుంది, స్నేహితుడు లాంటి సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు.
ముఖ్యంగా ఆయన చేసిన ‘నా ఊపిరి ‘ సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో నటన కు గానూ ఆయనకి అవార్డ్ కూడా వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వకపోవడంతో ఆయన మార్కెట్ డౌన్ అయింది.. అలా ఆయన నిదానంగా ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోయాడు. ఇక ఇది ఇలా ఉంటే మళ్లీ ఆయన కంబ్యాక్ ఎప్పుడు ఇస్తాడు అంటూ ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎవరిదైన ఇంటర్వ్యూ వచ్చిందంటే చాలు దాని కింద ప్రేక్షకులు వడ్డే నవీన్ గారి ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తారు అంటూ కామెంట్లు చేయడం చాలా పెద్ద వైరల్ గా మారింది.
అయితే ఆయన నుంచి ఒక సాలిడ్ కంబ్యాక్ ని మాత్రం ప్రేక్షకులు కోరుకుంటున్నారనే చెప్పాలి. దానికి తగ్గట్టుగానే ఆయన కూడా ఒక మంచి క్యారెక్టర్ దొరికితే మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడట. మరి దానికి తగ్గట్టుగానే దర్శక, నిర్మాతలు ఆయన కటౌట్ కి సరిపడా క్యారెక్టర్ డిజైన్ చేసి ఆయనను వాళ్ళ సినిమాలో నటింపజేస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి వడ్డే నవీన్ ఎలాంటి క్యారెక్టర్ తో కంబ్యాక్ ఇస్తాడో…