Star Directors: మన స్టార్ డైరెక్టర్ల గురువులు ఎవరో తెలుసా..?

రాఘవేంద్రరావు దగ్గర చాలా సంవత్సరాలపాటు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు గురువును మించిన శిష్యుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు..

Written By: Gopi, Updated On : March 20, 2024 8:40 pm

Star Directors

Follow us on

Star Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. వీళ్ళు మొదట కొన్ని సినిమాలకు కొంత మంది డైరెక్టర్స్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి ఆ తర్వాత దర్శకులుగా మారి మంచి విజయాలను అందుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడున్న మన టాప్ డైరెక్టర్ల గురువులు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

రాజమౌళి
రాఘవేంద్రరావు దగ్గర చాలా సంవత్సరాలపాటు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు గురువును మించిన శిష్యుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు..

పూరి జగన్నాథ్
పూరి జగన్నాథ్ శివ సినిమా టైమ్ లో రామ్ గోపాల్ వర్మ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు. కాబట్టి అప్పటినుంచి ఇప్పటివరకు రామ్ గోపాల్ వర్మ ను ఆయన గురువుగానే భావిస్తూ ఉంటాడు. అలాగే పూరీతోపాటు కృష్ణవంశీ, గుణశేఖర్, తేజ లాంటి దర్శకులు కూడా వర్మ స్కూల్ నుంచి బయటికి వచ్చిన వారే కాబట్టి వీళ్ళందరి గురువుకూడా రామ్ గోపాల్ వర్మ అనే చెప్పాలి…

హరీష్ శంకర్
ప్రస్తుతం హరీష్ శంకర్ వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమం లోనే ఈయన ఒకప్పుడు బుజ్జిగాడు, చిరుత సినిమాలకి పూరి జగన్నాథ్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు. ఇక అక్కడ ఫాస్ట్ గా సినిమాలు తీయడం ఎలాగో తెలుసుకొని తను ఫాస్ట్ గా సినిమా షూటింగ్ ను ఫినిష్ చేస్తున్నాడు…

సుకుమార్
సుకుమార్ వివి వినాయక్ దగ్గర దిల్ సినిమాకి వర్క్ చేశాడు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో ఆ తర్వాత దిల్ రాజుకి కథ చెప్పి ఆర్య సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు…

వంశీ పైడిపల్లి
వంశీ పైడిపల్లి భద్ర సినిమాకు బోయపాటి శ్రీను దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి అక్కడ మంచి పేరు సంపాదించుకొని దిల్ రాజు బ్యానర్ లోనే మున్నా సినిమా చేశాడు. ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ అవ్వకపోయినప్పటికీ మళ్లీ బ్యానర్ లోనే బృందావనం సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు…