https://oktelugu.com/

Rajamouli: కాపీ సీన్ల మీద స్పందించిన రాజమౌళి… నేను అలాంటి సీన్ల ను హాలీవుడ్ నుంచి తీసుకుంటాను… ఎందుకంటే..?

రాజమౌళి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్ గాని, షాట్ గాని ఏదో ఒక హాలీవుడ్ సినిమా నుంచి కాపీ చేశాడు అనే టాక్ అయితే వస్తుంటుంది.

Written By:
  • Gopi
  • , Updated On : March 20, 2024 / 03:02 PM IST

    Rajamouli reacts on copy scenes

    Follow us on

    Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి ఏది చేసినా ఒక పెను సంచలనంగానే మారుతుంది. ఆయన ఏ సినిమా తీసిన అందులో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. కాబట్టే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేని క్రేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు మహేష్ బాబుతో వరల్డ్ లోనే బెస్ట్ సినిమా తీయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్ గాని, షాట్ గాని ఏదో ఒక హాలీవుడ్ సినిమా నుంచి కాపీ చేశాడు అనే టాక్ అయితే వస్తుంటుంది.

    ఇక ఈ విషయం మీద స్పందించిన రాజమౌళి ఇలా చెప్పాడు. తను కొన్ని హాలీవుడ్ సినిమాలు చూసినప్పుడు అందులోని కొన్ని సీన్లను ఇన్స్పైర్ అవుతానని అయితే కాపీ మాత్రం చేయనని ఆ సీన్ తన సినిమాలో ఆ పర్టిక్యూలర్ సిచువేషన్ కి సింక్ అవుతుంది అనుకుంటే మాత్రం అలాంటి సీన్ ని తన సినిమాలో రీ క్రియేట్ చేయడానికి ఎప్పుడూ తను సిద్ధంగా ఉంటానని చెప్పడం విశేషం. అలాగే తను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు తను చూసిన కొన్ని ఇంగ్లీష్ సినిమాల్ని తన తోపాటు ఉండే మిగతా అసిస్టెంట్ డైరెక్టర్లకు చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఎగ్జైట్ అయ్యేవారట.

    అలా వాళ్లకు తెలియని కొత్త విషయాన్ని నేను చెప్పినప్పుడు ఎగ్జైట్ అవుతున్నారు కదా. అలాంటి సీన్లు తన సినిమాలో పెట్టుకుంటే ఆ సినిమా చూసే వాళ్ళకి కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుందనే ఉద్దేశ్యం తోనే నేను కొన్ని హాలీవుడ్ సినిమాల నుంచి సీన్లను మాత్రం ఇన్స్పైర్ అవుతూ సినిమా చేస్తూ ఉంటాను అని చెప్పడం విశేషం… ఇక మొత్తానికైతే రాజమౌళి ఇన్స్పిరై చేసిన, ఒరిజినల్ గా చేసిన ఆయన సినిమాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాలను సాధిస్తున్నాయి.

    కాబట్టి ఆయనను విమర్శించే వారు విమర్శిస్తూనే ఉన్నారు. ఆయన మాత్రం టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి. మన మీద ఎన్ని విమర్శలు వచ్చిన పట్టించుకోకూడదు అనే విషయాన్ని రాజమౌళిని చూసి మనం నేర్చుకోవచ్చు…