https://oktelugu.com/

Who is India’s No 1 Hero: రాబోయే రెండు సంవత్సరాల్లో ఇండియాలో నెంబర్ వన్ హీరో ఎవరో తెలియనుందా..?

ఒకరు ఒక సినిమాతో సక్సెస్ కొడితే మరి కొంతమంది ఆ తర్వాత సినిమాతో ఫ్లాప్ ని దక్కించుకుంటున్నారు. ఇక అందువల్లే వీళ్ళలో ఎవరు టాప్ హీరో అనేది చెప్పడం చాలా కష్టమవుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : May 10, 2024 / 02:07 PM IST

    Who is Indias No 1 Hero

    Follow us on

    Who is India’s No 1 Hero: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు సీనియర్ ఎన్టీయార్ నెంబర్ వన్ హీరోగా ఉండేవాడు. ఇక ఆయన తర్వాత ఆ స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవి కైవసం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న హీరోలలో నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకునే హీరో ఎవరు అనేది మాత్రం క్లారిటీ గా తెలియడం లేదు. స్టార్ హీరోలందరూ సమానమైన రికార్డులను కలిగి ఉన్నారు. ఇక అలాగే ప్రతి ఒక్కరు కూడా వైవిధ్యమైన నటన కనబరిచే వారే కావడం విశేషం…

    అందులోనూ ఒకరు ఒక సినిమాతో సక్సెస్ కొడితే మరి కొంతమంది ఆ తర్వాత సినిమాతో ఫ్లాప్ ని దక్కించుకుంటున్నారు. ఇక అందువల్లే వీళ్ళలో ఎవరు టాప్ హీరో అనేది చెప్పడం చాలా కష్టమవుతుంది. అయితే ఇప్పుడు రాబోయే రెండు సంవత్సరాల్లో ఇండస్ట్రీని ఏలే నెంబర్ వన్ హీరో ఎవరు అనేది క్లారిటీగా తెలియబోతుంది. ఇక రెండు సంవత్సరాల్లో ప్రతి హీరో కూడా రెండు సినిమాలను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక దాంతో పాటుగా ప్రతి ఒక్కరికి పాన్ ఇండియాలో మంచి మార్కెట్ అయితే ఉంది.

    కాబట్టి అక్కడ భారీ వసూళ్లను ఎవరైతే రాబడతారో వాళ్లే ఇకమీదట నుంచి టాలీవుడ్ బాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా కొనసాగబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక మహేష్ బాబు రాజమౌళితో చేయబోయే సినిమాతో మరో రెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ కి రెడీ అవుతాడు. కాబట్టి ఆయన కూడా ఈ పోటీలో చేరుతాడు. కానీ మహేష్ బాబు పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్నాడు. కాబట్టి దాన్ని స్పాన్ ఎక్కువగా ఉంటుంది. ఇక దాని కలెక్షన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి.

    అందుకని మహేష్ బాబుని ఆ ఒక్క సినిమా మినహాయించి ఆ తర్వాత సినిమా నుంచి ఈ పోటీలోకి తీసుకునే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఈ రెండు సంవత్సరాలు ప్రతి ఒక్క హీరో బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక మీదట రాబోయే రెండు సినిమాలతో రెండు ఇండస్ట్రీ హిట్స్ కనక కొట్టినట్టు అయితే ఆ హీరోనే నెంబర్ వన్ హీరో అవుతారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…