https://oktelugu.com/

Siddhu Jonnalagadda: హరీష్ శంకర్ డైరెక్షన్ లో సిద్దు జొన్నలగడ్డ.. ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కథతోనే వస్తున్నారా..?

బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమాను, నందిని రెడ్డితో మరొక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలు కనక సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తే ఆయన తొందరలోనే స్టార్ హీరో అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : May 10, 2024 / 02:13 PM IST

    Harish Shankar to direct Siddhu Jonnalagadda

    Follow us on

    Siddhu Jonnalagadda: ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు స్టార్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకుంటుంటే మధ్యలో యంగ్ హీరోలు కూడా వరుస సక్సెస్ లతో వాళ్ల హవా ను కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పటికే యంగ్ హీరో అయిన సిద్దు జొన్నలగడ్డ చేసిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో ఆయన మంచి విజయాలను అందుకున్నాడు.

    ఇక ఇప్పుడు ఆయన బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమాను, నందిని రెడ్డితో మరొక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలు కనక సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తే ఆయన తొందరలోనే స్టార్ హీరో అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దానికి తోడుగా ఆయన టిల్లు క్యూబ్ అనే సినిమాను కూడా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే సిద్దు జొన్నలగడ్డతో మరొక స్టార్ డైరెక్టర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఎవరు అంటే హరీష్ శంకర్…అవును మీరు వింటున్నది నిజమే ప్రస్తుతం హరీష్ శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు.

    ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ మొత్తాన్ని పూర్తిచేసి ఈ రెండు సినిమా లను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత తను ఒక యూత్ ఫుల్ సినిమాని చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఈ కథని దాదాపు నాలుగు సంవత్సరాల కిందటే రాసుకున్నాడట. ఇక ఈ సినిమాను విజయ్ దేవరకొండ తో చేయాలని ఆయన చాలా ప్రయత్నించినప్పటికీ విజయ్ అప్పుడు చాలా బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ తో ఈ సినిమాను చేయాలనే ప్రయత్నం లో హరీష్ శంకర్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

    ఇక ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది. కమర్షియల్ సినిమాలను తీయడం లో హరీష్ శంకర్ సిద్ధహస్తుడనే విషయం మనకు తెలిసిందే. ఇక హరీష్ సినిమాతో సక్సెస్ కొడితే కనక సిద్దు జొన్నలగడ్డ స్టార్ హీరోల రేంజ్ లోకి వెళ్లి పోతారని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…