https://oktelugu.com/

Chiranjeevi Vishwambhara: చిరంజీవి విశ్వంభర బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలో తెలుసా..?

ఆయన పేరు మీద దాదాపు ఒక 100 రికార్డుల వరకు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఆయన 70 ఏళ్ల వయసుకు దగ్గరలో ఉన్నా కూడా ఇప్పుడు వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : May 10, 2024 / 01:56 PM IST

    How many crores should be collected for Chiranjeevi Vishwambhara to break even

    Follow us on

    Chiranjeevi Vishwambhara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 40 సంవత్సరాలుగా వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ గా కొనసాగుతున్న నటుడు చిరంజీవి.. ఈయన ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. అలాగే తన రికార్డులను తనే బ్రేక్ చేసుకున్నాడు. మొదటి సారి తెలుగులో 10 కోట్లు వసూలు చేసిన సినిమా రికార్డు ను చిరంజీవి గారే క్రియేట్ చేశారు. ఇక మొదటిసారి 50 కోట్లు వసూలు చేసిన సినిమా రికార్డును కూడా తనే క్రియేట్ చేశాడు.

    ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పేరు మీద దాదాపు ఒక 100 రికార్డుల వరకు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఆయన 70 ఏళ్ల వయసుకు దగ్గరలో ఉన్నా కూడా ఇప్పుడు వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా తను ఎక్కడ తగ్గకుండా ఇప్పుడే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ హీరోలు ఎలాగైతే కష్టపడతారో అలా కష్టపడుతూ తన సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఈ సినిమాని చేస్తున్నాడు. ఇక ఈ సినిమా దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు 200 కోట్ల వరకు కలెక్షన్లు అయితే రాబట్టాల్సి ఉంటుంది. మరి చిరంజీవికి ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ అంత గొప్పగా లేదు. మరి ఈ సినిమా పాన్ ఇండియా లో సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

    కానీ చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరో ఉన్నాడు అంటే కూడా ఈ సినిమా నార్త్ లో మంచి క్రేజ్ ను అయితే సంపాదించుకుంటుంది. ఇక ఇంతకుముందు వచ్చిన సైరా సినిమా నార్త్ లో పెద్దగా ప్రభావాన్ని చూపించకపోవడంతో చిరంజీవికి అక్కడ భారీ దెబ్బ పడింది. కానీ విశ్వంభర సినిమాతో ఈసారి భారీ బ్లాక్ బాస్టర్ కొట్టడానికి తను అన్ని రకాలుగా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఈ సినిమా కనుక బ్రేక్ ఈవెన్ అయితే చిరంజీవి ఈ ఏజ్ లో కూడా మరొక రికార్డ్ ను క్రియేట్ చేస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడున్న సీనియర్ హీరోల్లో ఎవరు కూడా ఇంతవరకు 100 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టలేదు. కాబట్టి 200 కోట్ల కలెక్షన్స్ రాబడితే చిరంజీవి మరోసారి తన పేరుతో సరికొత్త రికార్డును క్రియేట్ చేసుకుంటాడు…