Champions Trophy 2025: వన్డే వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ తర్వాత అత్యంత ప్రాధాన్యం ఉన్న ట్రోఫీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy). మరో నెల రోజుల్లో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. దీంతో ఇందులో తలపడే దేశాలు జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ తమ జట్లను ప్రకటించాయి. తాజాగా ఆస్ట్రేలియా(Australia) కూడా ఈ మూగా టోర్నీకి జట్టును ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో శ్రీలంక(Srilanka) టూర్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cammins) సర్‌ప్రైజల్‌గా జట్టులోకి వచ్చాడు. అతడి నేతృత్వంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగనుంది.
గాయపడిన కమిన్స్..
ప్యాట్ కమిన్స్ చాలా రోజులుగ ఆచీల మండల గాయంతో బాధపడుతున్నాడు భారత్‌తో జరిగిన బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ తర్వాత ఈ నొప్పి తిరగబెట్టింది. దీంతో శ్రీలంకతో జరిగే సిరీస్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కమిన్స్‌కు విశ్రాంతి ఇచ్చింది. ఈనెల చివరన కమిన్స్ భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ రెండు కారణాలతో కమిన్స్ శ్రీలంకతో ఆడలేకపోయాడు. స్టీవ్ స్మిత్ శ్రీలంకతో ఆడే జట్టుకు సారథ్యం వమిస్తున్నారు. అయితే కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కమిన్స్ అభిమానులు ఆందోళన చెందారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ కమిన్స్ తిరిగి జట్టులోకి వచ్చారు.
ఆస్ట్రేలియా జట్టు ఇదే..
ప్యాట్ కమిన్స్(కెప్టెన్), అలెక్స్ కేరీ, నాథన్ ఎలీస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజెల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మ్యాట్ షార్ట్, స్టీవ్‌స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, ఆడమ్ జంపా.
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోపీ..
ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 9 వరకు టోర్నీ జరుగుతుంది. ఇందులో గ్రూప్–ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, గ్రూప్–బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆఫ్ఘానిస్తాన్ జట్లు ఉన్నాయి.
న్యూజిలాండ్ జట్టు ప్రకటన..
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా పొరుగు దేశం న్యూజిలాండ్(Newziland)కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించింది. మిచెల్ సాంట్నర్ సారథ్యంలో కివీస్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది. తుది జట్టు ఇదే..
డేవన్ కాన్వే, మార్క్ చాప్‌మన్, నాథన్ స్మిత్, రచిన్ రవీంద్ర, విల్‌యంగ్, బెన్ సీర్స్, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, లాకీ ఫెర్గూసన్, టామ్ లేథమ్, మిచెల్ బ్రేస్వెల్, మ్యాట్ హెన్రీ, డారెల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), విల్ ఓరౌర్కీ.