https://oktelugu.com/

Rajamouli: రాజమౌళి వెళ్లి నటించమని అడిగితే కథ నచ్చలేదన్నారు.. ఆ తరువాత హిట్టు కావడంతో నాలుక కరుచుకున్న స్టార్లు వీరే..

బాహుబలిలో శివగామి పాత్ర మెయిన్ గా ఉంటుంది. ఈ పాత్ర కోసం ముందుగా శ్రీదేవిని సంప్రదించగా రెమ్యూనరేషన్ ఎక్కువ అడిగి రిజెక్ట్ చేసింది. ఆ తరువాత రాజమౌళి మంచు లక్ష్మిని అడిగారు. కానీ ఆమె రిజెక్ట్ చేసింది. దీంతో రమ్యకృష్ణ ను చేర్చారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 22, 2023 / 11:35 AM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli: సినిమాల్లో అవకాశం రావాలంటే ఎన్నో ప్రయాసలు పడాలి. అందులోనూ స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరు వదులుకుంటారు? ఒక్కసారి నటిస్తే తమ జీవితం మారిపోతుందని వెంటనే ఒప్పేసుకుంటారు. అందులోనూ టాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి సినిమాల్లో నటించాలని తెలుగు హీరోలే కాకుండా బాలీవుడ్ నటులు సైతం ఆరాపడుతూ ఉంటారు. ఆయన టాలెంట్ ను చూసి కొందరు హిందీ స్టార్ హీరోలు చిన్న పాత్రల చేయడానికైనా ముందుకు వచ్చారు. అయితే కొందరు తెలుగు స్టార్లు మాత్రం రాజమౌళి సినిమాలో నటించడానికి ఆసక్తి చూపలేదు. అంతేకాకుండా దిగ్గజ డైరెక్టర్ వారి దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేసినా తాము నటించమని తేగెసి చెప్పారు. కానీ ఆ తరువాత వారు రిజెక్ట్ చేసిన సినిమాలు బంపర్ హిట్టుకొట్టడంతో నాలుక కరుచుకున్నారు. ఇంతకీ ఆ స్టార్లు ఎవరో చూద్దాం..

    రాజమౌళి తీసిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘సింహాద్రి’ సినిమా కోసం రాజమౌళి ముందుగా బాలకృష్ణ ను సంప్రదించాడు. కానీ ఆయన అప్పటికే సమరసింహారెడ్డి లాంటి యాక్షన్ సినిమాలు చేయడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఆ తరువాత ప్రభాస్ ను అనుకున్నారు. కానీ చివరికి జూనియర్ ఎన్టీఆర్ తో చేశారు.

    రాజమౌళి తీసిన బ్లాక్ బస్టర్లలో విక్రమార్కుడు ఒకటి. ఈ సినిమాలో ముందుగా పవన్ కల్యాణ్ తో చేద్దామనుకున్నారు. కానీ పవన్ ఈ ప్రాజెక్టును రిజెక్ట్ చేశారు. దీంతో రవితేజతో సినిమా తీయడంతో మూవీ బంపర్ హిట్టు కొట్టింది.

    మగధీర సినిమా కోసం ముందుగా బాలకృష్ణతో తీద్దామనుకున్నారు. కానీ ఆయనకు కథ నచ్చలేదు. దీంతో రామ్ చరణ్ తో సినిమా తీయగా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. అంతేకాకుండా ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఇదే మూవీలో శ్రీహరికి జోడిగా ఓ పాటలో సలోనీ కనిపిస్తుంది. ఈ పాత్ర కోసం ముందుగా అర్చనను అనుకున్నారు. కానీ నిడివి ఎక్కువ కావడంతో అర్చనకు అవకాశం ఇవ్వలేకపోయారు.

    రాజమౌళి కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలుస్తుంది ‘బాహుబలి’. ఈ సినిమా రెండు పార్టులుగా వచ్చి అలరించింది. ఇందులో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ లు నటించి అలరించారు. అయితే ఈ సినిమా ఊరికే పూర్తి కాలేదు. సినిమా నిర్మాణానికి ముందు ఎంతో తతంగం నడిచింది. ఇందులోని పాత్రల కోసం రాజమౌళి పెద్ద ఫైట్ చేశారు. తాను అనుకున్న కొందరి దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేశారు. కానీ వారికి కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారు.

    బాహుబలిలో శివగామి పాత్ర మెయిన్ గా ఉంటుంది. ఈ పాత్ర కోసం ముందుగా శ్రీదేవిని సంప్రదించగా రెమ్యూనరేషన్ ఎక్కువ అడిగి రిజెక్ట్ చేసింది. ఆ తరువాత రాజమౌళి మంచు లక్ష్మిని అడిగారు. కానీ ఆమె రిజెక్ట్ చేసింది. దీంతో రమ్యకృష్ణ ను చేర్చారు.

    బాహుబలి సినిమాలో హీరో పాత్రను ముందుగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ను అనుకున్నారు. ముందుగా ఈ సినిమాను రాజమౌళి బాలీవుడ్ లెవల్లో తీద్దామనుకున్నారు. కానీ ఆ తరువాత ఏమైందో తెలియదు గానీ.. మనసు మార్చుకొని తెలుగు హీరో ప్రభాస్ తో చేయించారు.

    బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. ఇందులో సత్యరాజ్ నటించారు. ఈయన కంటే ముందుగా అమితాబ్ బచ్చన్ ను అడిగారు. కానీ ఆయన కథ నచ్చలేదని చెప్పాడు. ఆ తరువాత మోహన్ లాల్ ను కూడా రాజమౌళి వెళ్లి అడిగాడు. కానీ అప్పటికే ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో చివరికి సత్యరాజ్ కు అవకాశం ఇచ్చారు.

    ఈ సినిమాలో భళ్లాల దేవుడి పాత్ర కోసం జాన్ అబ్రహంను సంప్రదించారు. ఆ తరువాత వివేక్ ఒబేరాయ్ ను అడిగారు. కానీ చివరికి రానా చేరాడు.

    ఆర్ఆర్ఆర్ సినిమాలో జెన్నీ క్యారెక్టర్ కోసం శ్రద్ధాకపూర్ ను అనుకున్నారు. ఆ తరువాత కత్రీనా కైఫ్ ఇసాబెల్ల కేఫ్ ను అనుకున్నారు. కానీ చివరికి ఈ పాత్ర ఒబిలియా కు అవకాశం ఇచ్చారు. ఇదే మూవీలో ఆలియా భట్ స్థానాన్ని పరిణితి చోప్రాను అనుకున్నారు. కానీ చివరికి ఆలియాను ఫైనల్ చేశారు.