Kollywood: విజయ్ ఆంటోని కూతురు మీరా విజయ్ ఆంటోని సెప్టెంబర్ 19న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వార్త కోలీవుడ్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. విజయ్ ఆంటోని నివాసానికి పలువురు చిత్ర ప్రముఖులు చేరుకొని ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. మీరా విజయ్ ఆంటోని మృతికి సంతాపం ప్రకటించారు. అయితే ఈ ఘటనను కవర్ చేయడానికి వచ్చిన మీడియా తీరుపై ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విజయ్ ఆంటోని ఇంటికి వచ్చిన ప్రముఖులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. సమయం సందర్భం లేకుండా సెలెబ్రిటీల వెంటబడ్డారు. అలాగే దారుణమైన థంబ్ నెయిల్స్ పెట్టి వీడియోలు ప్రసారం చేశారు. మీడియా ప్రవర్తించిన తీరుపై తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు భారతీరాజా అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
కోలీవుడ్ ప్రముఖులు మరణాంతర కార్యక్రమాలు కవరేజ్ కి మీడియాకు అనుమతి ఉందని వెల్లడించారు. పోలీసుల అనుమతి మీడియాకు ఉన్నా… చిత్ర వర్గాలు మాత్రం అనుమతించబోమని అన్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై చిత్ర ప్రముఖులు మరణిస్తే వారి నివాసాల వద్దకు మీడియాకు అనుమతి ఉండదు. బహుశా అంత్యక్రియలు కూడా కవర్ చేసే అవకాశం లేదు. ఇది మీడియాకు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.
ఒక రోజుల వ్యవధిలో కోలీవుడ్ లో రెండు విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. నటుడు, దర్శకుడు మారి ముత్తు గుండెపోటుతో ఇటీవల మరణించాడు. ఇటీవల విడుదలైన జైలర్ మూవీలో మారి ముత్తు కీలక రోల్ చేశారు. తాజాగా విజయ్ ఆంటోని కుమార్తె మీరా ఆంటోని ఆత్మ హత్య చేసుకోవడం సంచలనమైంది. మీరా మరణం విజయ్ ఆంటోనితో పాటు ఆయన భార్యను తీవ్ర విషాదంలోకి నెట్టింది.