Highest Remuneration Actor In India: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పెను ప్రభంజనాలను సృష్టించగలిగే దర్శకులు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు తెలుగులో మాత్రమే సినిమాలు చేసిన వీళ్లు పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలు చేయడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు…ఇక ప్రస్తుతం ఇండియాలో చాలామంది దర్శకులు గొప్ప సినిమాలను చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. అలాగే హీరోలు సైతం డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటించడానికి తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న హీరోలు భారీ మొత్తం లో రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తున్నారు.అలాగే లాభాల్లో పర్సంటేజ్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నాడు.
ఈయన ప్రతి సినిమాకి 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక స్పిరిట్ సినిమా కోసం రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ లో పర్సంటేజ్ ని కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి టాప్ హీరో తన సినిమాలతో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. కాబట్టి రెమ్యునరేషన్ తీసుకోవడంలో తప్పేమీ లేదని మరికొంతమంది అతనికి సపోర్టుగా మాట్లాడుతున్నారు.
ఇక ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న డైరెక్టర్స్ లలో రాజమౌళి మొదటి స్థానం లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఒక సినిమాకి 200 కోట్లు చార్జ్ చేస్తున్నాడు. వీలైతే పర్సంటేజ్ ని కూడా మాట్లాడుకుంటునట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం ప్రాఫిట్స్ లో 15% వాటా కూడా తీసుకుంటున్నారనే వార్తలైతే వస్తున్నాయి…ఇక ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరో దర్శకులు మన తెలుగు వాళ్లే కావడం విశేషం…
ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్పుకోవాలి అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు… ఇక రాబోయే రోజుల్లో కూడా మన హీరోలు అద్భుతమైన విజయాలను సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే మొదట అందరికి తెలుగు సినిమా ఇండస్ట్రీని గుర్తుకు వచ్చే స్థాయికి మన ఇండస్ట్రీని తీసుకెళ్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…