Rishab Shetty: కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా హీరో గా, డైరెక్టర్ గా ఎదిగిన రిషబ్ శెట్టి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తోంది. ఇప్పటికే ‘కంతార’, ‘కాంతార చాప్టర్ వన్’ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. ఇక దాంతో ఇప్పుడు ఆయన మరోసారి డైరెక్షన్ చేయాలని చూస్తున్నాడు. హీరోగా చేస్తూనే తన డైరెక్షన్లో వచ్చే సినిమాలను సూపర్ సక్సెస్ గా నిలపాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకోసమే ఒక స్టార్ హీరో ను డైరెక్షన్ చేసి సక్సెస్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక రిషబ్ శెట్టి ఒక స్టార్ హీరోను డైరెక్షన్ చేసే ఛాన్స్ కొట్టేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ తో రిషబ్ శెట్టి ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పలు సినిమాలతో బిజీగా ఉండడం వల్ల మరో రెండు సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రిషబ్ శెట్టి ఎన్టీఆర్ కి ఒక కథను కూడా వినిపించారట.
ఆ కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చడంతో తనను హీరోగా పెట్టి రిషబ్ శెట్టి డైరెక్షన్ లోనే సినిమా చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని ప్రతి ఒక్కరు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండడం వల్లే రిషబ్ శెట్టి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాన్ని కూడా అందిస్తున్నాడనేది వాస్తవం…
750 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టిన రిషబ్ శెట్టి ఈ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకొని 1000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టలని చూస్తున్నాడు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘ జై హనుమాన్’ సినిమాలో కూడా నటిస్తూ ఉండడం విశేషం… ఇక జూనియర్ ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…