Photo Story: సినిమాల్లో అవకాశాల కోసం కొందరు ఎన్నో ఏళ్లుగా పరితపిస్తుంటారు. కానీ చాలా మంది నటులు చైల్డ్ ఆర్టిస్టుగా, ఇతర పాత్రలతో ఎంట్రీ ఇస్తుంటారు. అలా ఓ సైడ్ పాత్రలో నటించి ఆ తరువాత హీరోయిన్ గా ఫేమస్ అయింది ఈ నటి. తెలుగు, తమిళం అని తేడా లేకుండా అవకాశాలు తెచ్చుకుంటూ స్టార్ హీరోయిన్లకు పోటీనిస్తోంది. అయితే ఈమధ్య సినిమాల్లో తగ్గించడం మానేసిన ఈ భామ.. సోషల్ మీడియాలో మాత్రం ట్రెండీగా ఉంటోంది. హాట్ హాట్ ఫొటోలతో దర్శనం ఇస్తూ యూత్ ను ఆకట్టుకుంటోంది. అయితే ఈమెకు సంబంధించిన ఓ చిన్ననాటి పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరంటే?
ఆ అందమైన నటి ఎవరో కాదు నిత్యా మీనన్. కేరళకు చెందిన నిత్యా మీనన్ కుటుంబం బెంగుళూరులో స్థిరపడింది. 1998 ఏప్రిల్ 8న నిత్యామీనన్ బెంగుళూరులోనే జన్మించింది. ప్రాతిమిక విద్యను మణపాల్ విద్యాసంస్థలో పూర్తి చేసి ఆ తరువాత పాత్రికేయురాలిగా కెరీర్ స్టార్ట్ చేసింది. అయితే ఆ తరువాత సినీ రంగంపై ఆసక్తి పెరగడంతో సినిమాల కోంస ట్రే చేసింది. ఈ నేపథ్యంలో పూణె లోని సినిమాటోగ్రఫీలో శిక్షణ తీసుకొన్న నిత్యా మీనన్ ఆ తరువాత తెలుగులో నటించింది. అసలు విషయమేంటంటే నిత్యా మీనన్ చైల్డ్ ఆర్టిస్టుగా ఓ సినిమాలో నటించింది.
1998 లో హనుమాన్ అనే ఆంగ్ల చిత్రంలో టబుకు చెల్లెలుగా ఓ అమ్మాయి నటించింది. ఆమె ఎవరో కాదు నిత్యా మీనన్. ఆ తరువాత 2011లో నాని హీరోగా వచ్చిన ‘అలా మైదలైంది’ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నానితో సమానంగా పోటీ పడి నటించిన నిత్యామీనన్ మొదటి సినిమాతోనే ఫేమస్ అయింది. ఆరువాత ఇస్క్, గుండెజారి గల్లంతయింది, కాంచన 2 సినిమాలో సక్సెస్ కావడంతో నిత్యా మీనన్ స్టార్ గుర్తింపు వచ్చింది.
అయితే ఆ తరువాత సినిమా అవకాశాలు తగ్గడంతో రెండో హీరోయిన్ పాత్రలో కూడా నటించింది. ఇక తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నిత్యా హవా సాగిస్తుంది. తమిళ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల పక్కన సినిమాలు చేసిన ఈమె మిగతా హీరోయిన్లకు తెగ పోటీనిస్తోంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లోనూ నిత్యా నటించింది. ‘మోడరన్ లవ్ హైదరాబాద్’ అనే సినిమాలో నిత్య నటన ఆకట్టుకుంటుంది.